ఆ స్టార్ హీరో సినిమాలో వైష్ణవి చైతన్య..? ఎవరంటే..?

ఆ స్టార్ హీరో సినిమాలో వైష్ణవి చైతన్య..? ఎవరంటే..?

by Harika

బేబీ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన నటి వైష్ణవి చైతన్య. వైష్ణవి చైతన్య ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

అంతే కాకుండా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇప్పుడు వైష్ణవి చైతన్య ఒక స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో వైష్ణవి చైతన్య ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తారు అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమాకు సంబంధించి వివరాలు బయటికి రాలేదు. ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిని కొత్తగా చూపించిన బాబి ఈ సినిమాలో బాలకృష్ణని ఎలా చూపిస్తారో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ALSO READ : BRAHMAMUDI RUDRANI:బ్రహ్మముడి రుద్రాణి వయసు ఎంతో తెలుసా.? రియల్ లైఫ్ ఫోటోలు షాక్ అవ్వాల్సిందే.!


You may also like

Leave a Comment