వకీల్ సాబ్ చెప్తే చప్పట్లు కొట్టాం… కానీ లవ్ పేరుతో బాహుబలి ఆ తప్పు చేస్తే మాత్రం హీరో అన్నాము.?

వకీల్ సాబ్ చెప్తే చప్పట్లు కొట్టాం… కానీ లవ్ పేరుతో బాహుబలి ఆ తప్పు చేస్తే మాత్రం హీరో అన్నాము.?

by Anudeep

Ads

బాహుబలి సినిమా మీరందరు చూసే ఉంటారు. తెలుగు సినీ ప్రేక్షకులు ఇది మా తెలుగు వారి సినిమా అని గర్వం గా చెప్పుకునే సినిమాల్లో బాహుబలి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అంత గా ఈ సినిమా ప్రపంచానికి నచ్చేసింది. కానీ.. చిన్న చిన్న పొరపాట్లు ఏ సినిమాలో అయినా ఉంటాయి అనుకోండి. ఈ సినిమా ను రాజమౌళి ఓ మేజిక్ లా చెక్కేసాడు. కానీ, అందులోనే లాజిక్ ని మాత్రం మిస్ అయిపోయాడు.

Video Advertisement

bahubali

“ఆడదాని వంటిపై చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు..తలా” అంటూ అమరేంద్ర బాహుబలి ఓ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగు కి మనమందరం చప్పట్లు కూడా కొడతాం. కానీ, ఫస్ట్ పార్ట్ లో అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలి చేసిందేంటి..? బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసినవారెవరైనా గార్డెన్ లో శివుడు అవంతిక ను చాలా నాచురల్ గా అందం గా మార్చడాన్ని మర్చిపోలేరు. ప్రేమ పేరుతొ.. శివుడు అవంతిక ఒంటిపై చేయి వేయలేదా..?

ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యి.. ఆమె చేతి పై టాటూ వేసాడు. అంతే కాదు.. ఆమె దుస్తుల పై కూడా కొద్దిపాటి చేంజెస్ చేయడం.. ఆమెకు ఇష్టం లేకుండానే ఆమెను కొత్త గా మార్చాడు.ఆ తరువాత అవంతిక అతన్ని ఇష్టపడ్డా… ఇదంతా ఆమెకు ఇష్టం లేకుండానే జరిగింది. వుమెన్ ను హెరాస్ చేస్తే.. హీరో లా ముందుకెళ్లి పోట్లాడే మనం.. హీరోలు హెరాస్ చేస్తున్నట్లు చూపిస్తే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం.

vakil sab

రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా లో కూడా ఈ పాయింట్ ను ఎత్తి చూపారు. ఆడవారికి ఇష్టం లేకుండా.. మీద చేయి వేయడానికి ఏ మగాడికి హక్కు ఉండదని, అది మొగుడైనా అంతేనని పవన్ కళ్యాణ్ బల్ల గుద్ది చెప్తే.. మనమంతా చప్పట్లు కొట్టాం.. మగువా మగువా అంటూ ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వాలని స్టేటస్ లు కూడా పెట్టాం.

watch video:

కానీ, బాహుబలి లో శివుడు, అవంతిక ను హెరాస్ చేస్తే ఎలా ఎంజాయ్ చేసాం..?.. అంటే.. సినిమాల్లో ఏది చూపించినా, మన హీరో లు ఏమి చేసినా చప్పట్లు కొడుతూనే ఉంటామా..? ఎవరినైనా తప్పు పట్టడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. ఒకే విషయాన్నీ ఒక చోట తిట్టి మరొక చోట ఎలా పొగడగలం మనం..? అమ్మాయిలను కించ పరిచేలా సినిమాల్లో హీరోలతో నటింపచేయడం ఎంతవరకు సమంజసం..?

watch video:


End of Article

You may also like