ఒకపక్క పెట్రోల్ రేట్ 100 కి దగ్గరలో ఉంది…కానీ అక్కడ ఫ్రీ…! అదొక్కటే కండిషన్.!

ఒకపక్క పెట్రోల్ రేట్ 100 కి దగ్గరలో ఉంది…కానీ అక్కడ ఫ్రీ…! అదొక్కటే కండిషన్.!

by Anudeep

Ads

ప్రస్తుతం ఏ రాష్ట్రము లో చూసినా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఈ క్రమం లో పెట్రోల్ కొనడం మధ్యతరగతి కుటుంబాలకు భారం గా మారుతోంది. అయితే, తమిళనాడు కు చెందిన ఓ పెట్రోల్ బంక్ లో మాత్రం పెట్రోల్ ఫ్రీ గా ఇస్తున్నారట. అయితే.. వారు ఓ కండిషన్ ను పెడుతున్నారు. పన్నెండవ తరగతి లోపు విద్యార్థులు తిరుక్కురల్ అనే గ్రంధం లోని పద్యాలను కంఠస్థం చేసి అప్పచెబితే.. వారి తల్లి తండ్రులకు పెట్రోల్ ఫ్రీ గా ఇస్తారట.

Video Advertisement

free petrol in tamilanadu

వింత గా ఉంది కదా… ఇది ఎక్కడో ఏంటో ఇపుడు తెలుసుకుందాం.. తమిళనాట కరూర్ సమీపంలో ఉన్న నాగంపల్లి వద్ద ఓ పెట్రోల్ బంక్ లో ఈ ఆఫర్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ ఓనర్ కె. సెంగుట్టువన్ కు మాతృభాష తమిళం అంటే ఎనలేని ప్రేమ. ఆ భాష పై అభిమానం తో.. పలువురిని ఆ భాష పై పట్టు సాధించేలా ప్రోత్సహించాలని భావించాడు. ఇందుకు గాను ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు.

free petrol in tamilanadu

తమిళ సాహిత్యం లో తిరువల్లువర్ రచించిన తిరుక్కురల్ గ్రంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రంధం అంటే సెంగుట్టువన్ కు ఎంత ఇష్టమంటే.. చివరికి పెట్రోల్ బంక్ కి కూడా వల్లువర్ పేరు పెట్టేసాడు. అంతే కాదు కె. సెంగుట్టువన్ వల్లువర్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భాష పై మక్కువ తోనే ఆయన ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. చాలా మంది పేరెంట్స్ పిల్లలకు పద్యాలు నేర్పించే పనిలో పడ్డారట. ఎంతైనా ఐడియా అదుర్స్ కదా.


End of Article

You may also like