Ads
ఉక్రెయిన్ పై రష్యా విరుచుకు పడుతోంది. ఉక్రెయిన్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని యుద్ధాన్ని కూడా చేస్తోంది రష్యా. అయితే వాంగా బాబా రష్యా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమిటి..? గతంలో వాంగా బాబా చెప్పిన విషయాలు ఏమిటి అనే దాని గురించి చూద్దాం.
Video Advertisement
ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. మనకి పోతులూరి వీర బ్రహ్మం గారు చెప్పినట్లే అక్కడ వాంగా బాబా కొన్ని విషయాలను చెప్పారు. మరి అవేమిటో చూసేయండి.
బల్గేరియాలో ఉండే ప్రజలు వాంగా బాబా చెప్పే మాటలు అన్నిటిని కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక వాంగా బాబా గురించి చూస్తే.. ఈమె 1911 వ సంవత్సరంలో జనవరి 31న జన్మించారు. ఈమెకి సుమారు 12 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రకృతి విపత్తుల వల్ల చూపు కోల్పోయారు. ఆ తర్వాత ఈమె భవిష్యత్తు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
అమెరికాలో జరిగిన 9/5 దాడులు, బ్రెగ్జిట్ ఇలా ఎన్నో విషయాలను ఈమె గతంలో చెప్పారు. అలానే అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్ అమెరికన్ బాధ్యతలు స్వీకరిస్తారని కూడా ఈమె అన్నారు. నిజానికి ఈమె చెప్పిన వాటిలో 85% నిజంగా జరిగాయి. అలానే ఈమె రష్యా గురించి కూడా కొన్ని చెప్పారు.
ఏదో ఒక రోజు పుతిన్ ప్రపంచాన్ని ఏలుతాడని ఆమె అన్నారు. రష్యా లార్డ్ ఆఫ్ వరల్డ్ గా మారుతుందని కూడా ఆమె అన్నారు. పైగా యుద్ధాన్ని ఆపడం ఎవరి తరం కాదని కూడా ఈమె చెప్పారు. వాంగా బాబా ఓ రచయితతో పుతిన్ ని, రష్యా కీర్తిని ఎవరు ముట్టుకోలేరని చెప్పారు. అయితే పుతిన్ ని ఆపడం ఎవరి వల్ల అవడం లేదు. ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ కూడా అతను వెనకడుగు వేయలేదు. అయితే బాగా ఈ బాబా చెప్పిన విషయాలన్నీ జరగడంతో అవి ఇప్పుడు సంచలనంగా మారాయి.
End of Article