కెజీఎఫ్ – 2 ఇంట్రడక్షన్ సీన్ లో ఇది గమనించారా.? అందులో ఈ 5 విషయాలు దాగున్నాయా.?

కెజీఎఫ్ – 2 ఇంట్రడక్షన్ సీన్ లో ఇది గమనించారా.? అందులో ఈ 5 విషయాలు దాగున్నాయా.?

by Anudeep

Ads

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018 లో వచ్చిన కె జీ ఎఫ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కె జీ ఎఫ్ తో కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసాడు ప్రశాంత్ నీల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కె జీ ఎఫ్ చాప్టర్ 2 ఈ ఏడాది విడుదలై ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టింది.

Video Advertisement

అయితే కె జీ ఎఫ్ 2లో రాకీ (యశ్) గురించి చెప్పేటప్పుడు డిఫరెంట్ స్క్రీన్ ప్లే లు ఉన్నాయి. వీటన్నిటిని చూసేప్పుడు ప్రేక్షకుడు ఎలాంటి కన్ఫ్యూజ్ అవకుండా డైరెక్టర్ తెలివిగా స్టోరీ రాసుకున్నాడు.

ఆ డిఫరెంట్ స్క్రీన్ ప్లే లు ఏంటో ఒకసారి చూద్దాం..

1. విజయేంద్ర వాసిరాజు (ప్రకాష్ రాజ్) గరుడ చనిపోయాక  కె జీ ఎఫ్ (2018) లో ఏం జరుగుతుందో దీప హెగ్డే (మాళవిక అవినాష్) కి చెప్పడంతో కె జీ ఎఫ్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది.

2. రాఘవ (రావు రమేష్) రమిక (రవీణ టాండన్) కు (1979) రాకీ ఎప్పుడూ, ఎక్కడా, ఎవరికీ కనిపించకుండా వెనక ఉండి కె జీ ఎఫ్ వ్యవహారాలు ఎలా నడిపిస్తున్నాడో చెప్తాడు.

3. ఇక్కడ కూడా రాఘవ రమికకు చిన్నప్పుడు (1961) రాకీ ఎన్ని అవమానాలు పడ్డాడో వివరిస్తాడు.

4. చిన్నప్పుడు అన్ని అవమానాలు పడ్డ రాకీ పెద్దయ్యాక ఓ పెద్ద సామ్రాజ్యాన్ని (1973) ఎలా నిర్మించుకున్నాడు. బాంబే తీర ప్రాంతంలో మొదలై, బాంబే మొత్తాన్ని ఎలా తన కంట్రోల్ లోకి తీసుకొని ఇండియాని ఎలా అక్రమించాడో రాఘవ రమికకు వివరిస్తాడు.

5. ఇక్కడ రాకీ ప్రస్తుతం ఎంత పెద్ద సైన్యంతో ఉన్నాడో వివరిస్తూ.. “కె జీ ఎఫ్ చెర నుంచి అక్కడి ప్రజలను విడిపించడంతో అక్కడున్న జనాలు రాకీకి అండగా నిలబడ్డారు. రాకీని మనం ఏదైనా చేయాలి అంటే.. ముందు అక్కడున్న పదిహేను లక్షల మందిని దాటుకుని వెళ్ళాలి” అని అప్పటి పరిస్థితులను ప్రధాని అయిన రమికకు సి బి ఐ  స్పెషల్ వింగ్ ఆఫీసర్ అయిన రాఘవ వివరిస్తాడు.

ఈ రకంగా వివిధ రకాలైన స్క్రీన్ ప్లే లతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథని ప్రేక్షకులకు సులువుగా అర్థమయ్యేలా చేసి ఆకట్టుకున్నాడు.


End of Article

You may also like