దళపతి విజయ్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం తో తమిళం లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజుకు కూడా తమిళ్‌లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఇన్ని స్పెషాలిటీస్ ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.

Video Advertisement

ఇటీవలే విడుదలైన పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వారిసు రిలీజ్ పై ఒక వైపు వివాదాలు చుట్టుముడుతున్నా ..  మరో వైపు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వారసుడు ఇన్సైడ్ రిపోర్ట్ అంటూ ఈ రివ్యూ వైరల్ అవుతోంది. వారసుడు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ పవర్ టాకీస్ పేరుతో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది.

inside talk of varisu movie..

వారిసు మూవీ ఫామిలీ ఎంటర్టైనర్, ఈ సంక్రాంతికి సరైన సినిమా అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. దీంతో విజయ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్‌ కూడా ఇటీవల ఈ సినిమాను చూసి ఫిదా అయ్యాడట. రామ్ చరణ్‌ కోసం చెన్నైలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరిగిందని తెలుస్తోంది.ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లోనే శంకర్‌తో రామ్ చరణ్‌ సినిమా తీస్తున్నాడు. శంకర్ చిత్రానికి సంబంధించిన పనుల నిమిత్తమే అతను రీసెంట్‌గా చెన్నైలోని తమన్ రికార్డింగ్ స్టూడియోకు వెళ్లినట్లు తెలుస్తోంది.

inside talk of varisu movie..

సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘వారిసు’ చిత్రం విడుదలవనుంది. ఈ చిత్రంలో జయసుధ, ప్రకాష్‌రాజ్‌, శరత్‌ కుమార్‌, యోగిబాబు, శ్రీకాంత్‌, ఖుష్భు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ్‌లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ కానుండగా.. హిందీ, మలయాళ భాషల్లో సైతం ఏక కాలంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.