దళపతి విజయ్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం తో తమిళం లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజుకు కూడా తమిళ్‌లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఇన్ని స్పెషాలిటీస్ ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.

Video Advertisement

 

ఇటీవలే విడుదలైన పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వారిసు రిలీజ్ పై ఒక వైపు వివాదాలు చుట్టుముడుతున్నా ..  మరో వైపు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్‌ కోసం చెన్నైలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరిగిందని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్‌ సినిమాను చూసి ఫిదా అయ్యాడట. సూపర్‌గా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడట. అయితే విజయ్ వారిసు సినిమాను చూసేందుకు ప్లాన్ చేసింది మాత్రం దిల్ రాజు అని తెలుస్తోంది.

varisu first review by ramcharan..

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లోనే శంకర్‌తో రామ్ చరణ్‌ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్లాన్ చేశాడు. శంకర్ చిత్రానికి సంబంధించిన పనుల నిమిత్తమే అతను రీసెంట్‌గా చెన్నైలోని తమన్ రికార్డింగ్ స్టూడియోకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే #RC15తో పాటు విజయ్ ‘వారిసు’ చిత్రానికి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో తమన్ స్టూడియోకు వెళ్లినపుడు అక్కడే ఉన్న దిల్ రాజు.. చరణ్ కోసం ప్రత్యేకంగా ‘వారిసు’ ప్రైవేట్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడట.

varisu first review by ramcharan..

దీంతో ఈ సినిమాని చూసిన రామ్ చరణ్.. తనకు బాగా నచ్చడంతో మూవీ టీమ్‌‌ను అప్రిషియేట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. అయితే ముందు వారసుడు సినిమా కథను మన మహేష్ బాబుకే చెప్పాడట దిల్ రాజు. కానీ మహేష్‌ బాబు బిజీగా ఉండటంతో కుదర్లేదట. ఆ తరువాత అదే కథను రామ్ చరణ్‌కి కూడా వినిపించాడట. కానీ శంకర్‌తో సినిమా ఉండటం, డేట్స్ లేకపోవడంతో విజయ్ వద్దకు వెళ్లిందని దిల్ రాజు ఇదివరకు వెల్లడించారు. అందుకే ప్రత్యేకం గా రామ్ చరణ్ కి ఈ చిత్రాన్ని చూపించినట్లు టాక్.