Ads
గుడిని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడికి వెళ్లాలంటే ఆ రోజు మాంసాహారం ముట్టుకోకుండా స్నానం చేసి వెళ్తాం. దేవాలయానికి మన భారతదేశంలో అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి గుడిని పాకిస్తాన్ లో మరుగుదొడ్డి గా వాడుతున్నారు.
Video Advertisement
పాకిస్తాన్ లోని కరాచీ లోని మనోరా ఐలాండ్ బీచ్ లో దాదాపు 16వ శతాబ్దంలో వరుణ్ దేవ్ మందిర్ నిర్మించారు. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నదట. భోజోవాల్ నాన్సీ భాటియా అనే వ్యక్తి ఆ ఆలయం ఉన్న ద్వీపాన్ని ఖరీదు చేశాడట.
తర్వాత భాటియా కుటుంబం ఎంతో కాలం పాటు ఆ ఆలయ బాధ్యతలు నిర్వహించారు. ఆలయ గోడలపై పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రం లోని ఖైర్‌పూర్ లో ఉన్న భ్రియా అనే ప్రాంతానికి చెందిన సేత్ హర్‌చంద్ మల్ దయాల్ జ్ఞాపకార్థం సిందీ భాషలో కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి.
కాలంతోపాటు మెల్లగా భాటియా వంశస్థులు గుడి బాధ్యతలను నిర్వహించడం తగ్గింది. దానికి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. తర్వాత ఆలయాన్ని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ చూసుకుంటోంది. కానీ పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ఆలయ బాధ్యతలు మాత్రం సరిగా నిర్వహించడం లేదు. దాంతో గుడి లోని గోడలు మెల్లగా పడిపోవడంతో గుడి శిథిలావస్థకి చేరుకుంది.
గుడి దగ్గర ఉన్న బీచ్ కి వచ్చే జనాలు గుడిని మరుగుదొడ్డిగా వాడడం మొదలుపెట్టారు. అంతకుముందు గుడిలోకి రాకుండా గేట్లు ఉండేవి. తర్వాత అవి కూడా తీసేసారు. 2008లో ఆలయ పరిరక్షకుడు జీవ్‌రాజ్ అసలు ఆలయ హక్కులు ఎవరికీ చెందుతాయో తెలుసుకోవడానికి మనోరా కంటోన్మెంట్ బోర్డు కి లేఖ రాశారు. ఆలయం ఉన్న స్థలం పాకిస్తాన్ నేవీ కి చెందుతుందని బోర్డు నుండి జవాబు వచ్చింది.
1950 సంవత్సరంలో ఈ గుడిలో చివరిసారిగా పూజ జరిగింది. 1992లో ఆలయానికి సీల్ వేశారు. తర్వాత ఆలయ పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఝూలే లాల్ ఆలయం, శివాలయం ఉన్నాయి. 1970లో ఈ రెండు ఆలయాల కి చిన్నచిన్న రిపేర్లు చేశారు. కానీ తర్వాత ఆలయాలు ధ్వంసం అవుతుండడంతో రిపేర్ పనులు ఆపేశారు.
కొన్ని సంవత్సరాలకి యూఎస్ అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ వాళ్లు విరాళాలు ఇచ్చారు . ఆ విరాళంతో ఈ రెండు ఆలయాలని మరమ్మత్తు చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా వరుణ్ దేవ్ మందిర్ కూడా పునరుద్ధరించాలని ఆశిద్దాం.
End of Article