వాస్తు ప్రకారం తులసి కోటను ఇంట్లో ఎక్కడ పెట్టాలి.? ఏ వైపు పెట్టకూడదు.?

వాస్తు ప్రకారం తులసి కోటను ఇంట్లో ఎక్కడ పెట్టాలి.? ఏ వైపు పెట్టకూడదు.?

by Mounika Singaluri

తులసి మొక్క లేని తెలుగు ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలాగే మన తెలుగు వారు తులసి చెట్టుని దైవంలా భావించి పూజలు చేస్తారు. తులసి మొక్కలు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీబయటిక్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది.గుండె ఆరోగ్యానికి, ఒత్తిడి, డయాబెటిస్ వంటి సమస్యలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

Video Advertisement

తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావించి ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఎండిపోతే అశుభంగా భావిస్తారు. విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టమట. అందుకే మనం తులసిని లక్ష్మీదేవిగా భావిస్తాము. అయితే ఇంట్లో తులసి మొక్కని పెట్టేటప్పుడు ఏ వైపు పెడితే మంచిదని చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎందుకంటే మనదేశంలో వాస్తుకి ఎలాంటి ప్రాముఖ్యత ఉందొ తెలిసిందే.

ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క సహజమైన కోరిక. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎందరో సలహాలు పాటిస్తూ ఇంటి నిర్మాణం చేపడతాం. అయితే చాలామంది వాస్తు ని కొట్టి పారేస్తారు కానీ వాస్తు అనేది ఇంటికి చాలా అవసరం. ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉన్నట్లయితే అది మనిషి ఆరోగ్య మీద, సంపద మీద, సంబంధాల మీద తీవ్ర ప్రభావాలని చూపిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

ఇక వాస్తు ప్రకారం తులసిని ఇంట్లో ఏ వైపు పెట్టాలి అంటే…ఎప్పుడూ కూడా తూర్పు వైపు తులసి మొక్కని పెట్టడం మంచిది. ఒకవేళ కనుక కుదరకపోతే బాల్కనీ లేదా కిటికీ దగ్గర ఉత్తరం వైపు లేదంటే ఈశాన్య వైపు పెట్టడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్క దగ్గర శుభ్రం పాటించాలి. తులసి మొక్క దగ్గర చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలి. చీపురు, చేట, చెత్తబుట్ట వంటివి పెట్టకూడదు. తులసి మొక్కను కింద పెట్టకూడదు. కొంచెం గచ్చుకి ఎత్తుగా కట్టి దాని మీద పెట్టాలి. తులసి మొక్కతో పాటుగా పక్కన ఏ ముళ్ళ మొక్క ఉండకూడదు. తులసి కోటలో కేవలం తులసి మొక్కని మాత్రమే ఉంచాలి.


You may also like

Leave a Comment