గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రమే ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే వీరసింహారెడ్డి మూవీని గతంలో మాదిరిగానే రీవేంజ్ స్టోరీతో తెరకెక్కించారు.

Video Advertisement

 

 

అయితే వీరసింహారెడ్డి మూవీ సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ నిడివి ఎక్కువ కావడంతో కొంతమంది ప్రేక్షకులు బోరింగ్ గా ఫీలవుతున్నారు. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. అయితే ఈ సినిమా తుది ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. వీరసింహ రెడ్డి చిత్రం మొత్తాన్ని బాలయ్య తన భుజాలపై మోశారు. సినిమా లో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. క్లైమాక్స్ సమయానికి వరలక్ష్మి శరత్ కుమార్ తో వచ్చే ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.

veera simha reddy final result..!!

కానీ బాలకృష్ణ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ను నమ్మి ఛాన్స్ ఇవ్వకుండా కథ, కథనంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో బాలయ్య ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వీరసింహ రెడ్డి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ర్నాటక హక్కులు రూ. 4.50 కోట్లకు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.20 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా ఉంది.

veera simha reddy final result..!!

బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది. మరోవైపు ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాలు బాలయ్య సినిమాకి పోటీగా రానున్నాయి. ఆ సినిమాల ఫలితాలు వీరసింహారెడ్డి ఫైనల్ రిజల్ట్ ను డిసైడ్ చేయనున్నాయి. ప్రస్తుతానికి అయితే వీరసింహ రెడ్డి కి మిక్స్డ్ టాక్ వస్తోంది. మొదటి రోజు ఈ చిత్రం 8 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.