Ads
- చిత్రం : రానా నాయుడు
- నటీనటులు : వెంకటేష్, రానా, సుర్వీన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, గౌరవ్ చోప్రా, సుచిత్ర పిళ్లై
- నిర్మాత : సుందర్ ఆరోన్, మనన్ మెహతా
- దర్శకత్వం : కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ
- సంగీతం : జాన్ స్టీవర్ట్ ఎదురి
- విడుదల తేదీ : మార్చి 10 , 2023
స్టోరీ:
Video Advertisement
రానా నాయుడు(రానా) బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చిన దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. కానీ తన సొంత సమస్యని మాత్రం సాల్వ్ చేసుకోలేక పోతాడు. ఒక రోజు రానా ఒక స్కాండల్ ని పరిష్కరించే సమయంలో అతని తండ్రి నాగ(వెంకటేష్) జైలు నుండి విడుదల అవ్వడంతో సమస్య ఇంకా పెద్దది గా మారుతుంది, చివరకు ఎలాంటి సమస్య అయినా పరిష్కరించేవాడు, తన తండ్రి తో ఉన్న సమస్యను పరిష్కరించుకుంటాడా? అసలు రానా తన తండ్రిని ఎందుకు ద్వేషిస్తున్నాడు అనేది మిగతా కథ.
రివ్యూ:
సాధారణంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు అంటే సినిమాల్లో మాత్రమే నటిస్తారు. కానీ వెంకటేష్ మాత్రం అలాంటి అపోహని తొలగిస్తూ సిరీస్ లో నటించారు. వెంకటేష్ తో పాటు రానా కూడా ఇందులో నటించారు. ఈ సిరీస్ కి అతి పెద్ద ప్లస్ పాయింట్ వెంకటేష్, రానా. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నీవేశాలు అలరిస్తాయి. స్టార్టింగ్ లో రానా యొక్క పాత్రా పరిచయం మరియు అతని వ్యక్తిగత జీవితం, అతని ప్రొఫెషనల్ జీవితం ఎస్టాబ్లిష్ చేయడంతో కథ కొంచెం నెమ్మదిస్తుంది.
మొదటి రెండు ఎపిసోడ్ లు స్లో గా ఉంటాయి. కానీ అతని తండ్రి నాగ జైలు నుండి విడుదలైన తర్వాత, డ్రామా మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో తండ్రి కొడుకుల మధ్య వార్ నడుస్తూనే, వాళ్ళ మధ్య చెప్పుకోలేని ప్రేమని బాగా చూపించారు. వెంకటేష్‌ని ఇటువంటి పాత్రలో ఇంతకు ముందు చూడలేదు. ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ జీవిచేసారు. కానీ వెంకటేష్ నోటి వెంట బూతులు వినడం ఆయన ఫాన్స్ కి కాస్త కష్టమే. రానా పాత్రకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ దొరకలేదు.
ఇక మిగిలిన నటులు తమ పరిధి మేరకు నటించారు. ఇక దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ మానవ సంబంధాల్ని మంచి యాక్షన్ తో జోడించి చాలా బాగా తీశారు. నరేషన్ లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. టెక్నికల్‌గా రానా నాయుడు బాగుంది , జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది, జాన్ స్టీవర్ట్ ఎదురురి సంగీతం సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీస్కెళ్ళాయి.
ప్లస్ పాయింట్స్:
- వెంకటేష్
- మ్యూజిక్
మైనస్ పాయింట్స్
- స్లో గా సాగే కథనం
రేటింగ్:
2 .75 / 5
టాగ్ లైన్ :
తండ్రి, కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్, రివేంజ్ డ్రామా ‘రానా నాయుడు’
watch trailer :
End of Article