“ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం ఇదే..!” అంటూ… రీ ఎంట్రీపై “వేణు తొట్టెంపూడి” ఏమన్నారంటే..?

“ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం ఇదే..!” అంటూ… రీ ఎంట్రీపై “వేణు తొట్టెంపూడి” ఏమన్నారంటే..?

by Anudeep

Ads

వేణు తొట్టెంపూడి స్వయంవరం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై తొలి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

Video Advertisement

2012లో విడుదలైన  దమ్ము చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించి.. దాదాపు తొమ్మిది సంవత్సరాలు నుంచి సినిమా పరిశ్రమలో కనుమరుగయ్యారు. మరలా తిరిగి రవితేజ నటిస్తున్నా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు వేణు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రామారావు ఆన్ డ్యూటీ సినిమా విశేషాలను పంచుకున్నారు.

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ  ఈ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గాను శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ అండ్ ఆర్ టి టీమ్ వర్క్స్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. నేను సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. కొన్ని బాధ్యతల వల్ల నటనకు దూరంగా ఉండవలసి వచ్చింది. మళ్లీ తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గర కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను ఒక కీలక పాత్ర వహిస్తున్నాను. అంతేకాకుండా పారాహుషార్ అనే సినిమాలో కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Ramarao on duty

ఈ చిత్రంలో నటించడానికి మొదట సినిమా దర్శకనిర్మాతలు నాకు ఫోన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఒప్పుకోలేదు. తర్వాత దర్శకుడు శరత్ మండవ నన్ను పర్సనల్ గా కలిసి ఈ చిత్ర కథను నాతో సంభాషించారు. నా రోల్ కి ఉన్న ఇంపార్టెంట్ నీతో నేను వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పేశాను.  అంతేకాకుండా రవితేజ తో నటించడం ఎంతో సరదాగా ఉంటుంది. రవితేజ నటన పై ఎంతో విశిష్టత కలిగిన వ్యక్తి. రవితేజ ఒక పవర్ హౌస్ అలాంటివారు. ఆయనతో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉంది.

ఇంతకు ముందు నేను చేసిన చిత్రాలలో నాకు కామెడీ పాత్రలే ఎక్కువగా ఉండేవి. కానీ ఈ చిత్రంలో నన్ను సీఐ మురళిగా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించనున్నారు.  మరి ఇంత కాలం తర్వాత వచ్చిన నన్ను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారని వేచి చూడాలి అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు వేణు తొట్టెంపూడి.

Watch this video:

 

 


End of Article

You may also like