ఒకప్పటి ఈ పాపులర్ నటుడు గుర్తున్నారా? సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే?

ఒకప్పటి ఈ పాపులర్ నటుడు గుర్తున్నారా? సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే?

by Anudeep

Ads

ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి అందరికి సుపరిచితులు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన సినిమాలను ఇప్పటికీ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసే వారు చాలా మందే ఉన్నారు.

Video Advertisement

ఆయన నటించిన “చిరునవ్వుతో” సినిమా ఎవర్ గ్రీన్. 2006 తరువాత ఆయన తన సినిమాలను తగ్గించారు. 2012 లో దమ్ము సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించారు. ఆ తరువాత రామాచారి అనే సినిమాలో హీరోగా కనిపించినా.. ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.

2006 వరకు నిరాటంకంగా నటించిన ఆయన తరువాత మాత్రం జోరు తగ్గించారనే చెప్పాలి. రామాచారి తరువాత ఆయన తెరపై పెద్దగా కనిపించలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత “రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమాతో ఆయన వెండితెరపై కనిపించనున్నారు. రవితేజ హీరోగా శరత్‌ మండవ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

venu tottempudi

ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన పలు విషయాల గురించి ముచ్చటించారు. కొన్ని అనుకోని కారణాల వలన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని.. అందుకే సినిమాలకు కూడా దూరం అయ్యానని చెప్పుకొచ్చారు. “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాలో కూడా మొదట నటించాలని అనుకోలేదని, కానీ దర్శక నిర్మాతలు అడిగిన తర్వాత కూడా నో చెప్పానన్నారు. సినిమాలో నటించకపోయినా కనీసం కలుద్దామని శరత్ మండవ ఫోన్ చేసారని.. అలా కలిసినప్పుడు ఈ సినిమా పాత్ర గురించి చెప్పడంతో.. నచ్చి చెయ్యడానికి ఒప్పుకున్నానని అన్నారు.


End of Article

You may also like