రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. ముఖ్యంగా అలనాడు అమె సినిమాలో చేసిన నాట్యం ఇప్పటికీ పలువురు ఆదరణ పొందుతూనే ఉంది.

Video Advertisement

 

లెజెండరీ నటుడు,యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, ప్రతి నెల యన్టీఆర్ తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్ కు అవార్డు,గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తారు. అలా ఈ నెల యన్టీఆర్ పురస్కారానికి అలనాటి తార ఎల్. విజయ లక్ష్మి ఎంపికయ్యారు. దీని కోసం ఆమె అమెరికా నుంచి 50 సంవత్సరాల తర్వాత తెనాలికి వచ్చారు.

veteran dancer vijayalakshmi says se dont know allu arjun..

ఈ నేపథ్యం లో ఈమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ జనరేషన్ హీరోలు నటించిన ఏ సినిమాను చూశారు అని అడగగా. పుష్ప సినిమాను చూశాను అని ఆమె చెప్పారు. అయితే ఆయన ఎవరో తెలుసా అని అడగడంతో తెలియదు అంటూ సమాధానం ఇచ్చింది.

veteran dancer vijayalakshmi says se dont know allu arjun..

అప్పుడు వ్యాఖ్యాత అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పడంతో వెంటనే విజయలక్ష్మి ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడిగితే రామానాయుడు మనవడు, ఎన్టీఆర్ మనవడు అని చెబుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

veteran dancer vijayalakshmi says se dont know allu arjun..

ఈ తరం ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మి గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అంతే కాకుండా ఆమెతో స్టార్ హీరోలు సైతం డాన్స్ చేయాలి అనుకునేవారు అంటే అప్పట్లో ఆమె రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.