Ads
కమెడియన్ విద్యుల్లేఖ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి విద్యుల్లేఖ తమిళ్ అమ్మాయి. కానీ, ఆమె తెలుగు వారికి కూడా బాగా దగ్గరయింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆమె బాగా రాణిస్తున్నారు. ఇటీవల ఆమె చాలా బరువు తగ్గి వార్తల్లో నిలిచారు.
Video Advertisement
తాజాగా, ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. కొంచం బొద్దుగా ఉన్నా విద్యుల్లేఖ ముద్దుగానే ఉంటారు. కానీ, ఆమె పట్టుదలతో బరువు తగ్గి అభిమానులకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. ఇటీవల హనీమూన్ కి కూడా వెళ్లిన విద్యుల్లేఖ తన ఫోటోలను సోషల్ మీడియా లో కూడా పంచుకున్నారు. అయితే.. ఆమె స్విమ్ సూట్ వేసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో అసలు గొడవ మొదలైంది.
కొందరు అభిమానులకు ఈ ఫొటోస్ నచ్చకపోవడం తో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో, విద్యుల్లేఖ కూడా వారికి ఘాటు గానే సమాధానం ఇచ్చారు. “నా డ్రెస్ నా ఇష్టం.. అయినా మీరు ఎన్నాళ్లయినా మారరా.. మీరు చూసే దృష్టి కోణం మార్చుకోరా ? అంటూ ఫైర్ అవుతోంది. అమ్మాయి అంటే అణిగి మణిగి ఉండాలా? నేను స్విమ్ సూట్ వేసుకుంటేనే ఇలా అంటున్నారా? అంటీస్, అంకుల్స్ 1920 ల కాలం నుంచి బయటకి రండి అంటూ గట్టిగానే కౌంటర్ లు వేశారు.
సమాజం ఆలోచించే తీరు మారాలని, మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే.. సాంప్రదాయ దుస్తుల్ని వేసుకుంటున్న వారందరు హ్యాపీ గానే ఉంటున్నారా? అని ప్రశ్నించారు. జీవితానికి భద్రతని, భరోసాని ఇచ్చే నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి నా భర్తగా దొరకటం నా అదృష్టం. ఇలాంటి కామెంట్స్ కి స్పందించద్దని నా భర్త చెప్పినా, నా వల్ల కాలేదు. మీ ఆలోచన తీరుని నేను మార్చలేను..” అంటూ ఘాటు గా రిప్లై ఇచ్చారు.
End of Article