ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఇటీవల మరణించింది. మీరా ఒత్తిడికి లోనయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వచ్చాయి. మీరా మృతి పట్ల ఎంతో మంది ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Video Advertisement

ఎంతో మంది తమిళ ఇండస్ట్రీకి చెందిన నటులు, అలాగే ఇతర సినిమా వాళ్లు వెళ్లి విజయ్ ఆంటోనీని పరామర్శించారు. మీరా చనిపోయే ముందు ఒక లెటర్ రాసింది అని, ఆ లెటర్ ఇప్పుడు తన టెక్స్ట్ బుక్ లో ఒక లెటర్ దొరికింది అని అన్నారు.

అందులో మీరా, తన స్నేహితులని, టీచర్స్ ని మిస్ అవుతాను అని, అందరికీ లవ్ యు, అలాగే థాంక్యూ అని రాసింది. ఈ విషయంపై విజయ్ అంటోనీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ఆ లెటర్ లో విజయ్ ఆంటోనీ తమిళ్ లో రాశారు. విజయ్ ఆంటోనీ ఈ విధంగా రాశారు. “విజయ్ ఆంటోనీ, ప్రియమైన వారికి, నా కూతురు మీరా చాలా ప్రేమగా ఉంటుంది. చాలా ధైర్యవంతురాలు. ఇప్పుడు తను ఈ ప్రపంచం కంటే మంచి ప్రదేశంలో ఉంది.”

vijay antony letter about his daughter

“అక్కడ కులం, మతం, డబ్బు, ఈర్ష, నొప్పి, పేదరికం, ద్వేషం లాంటివి ఉండవు. తను నాతో మాట్లాడుతూ ఉంది. నేను కూడా తనతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు తనతో సమయం గడపడం మొదలు పెట్టాను. నేను ఇప్పుడు తన పేరు మీద చేయబోతున్న మంచి పనులు అన్నిటికీ తనే పునాది వేసింది. మీ విజయ్ ఆంటోనీ.” అని రాశారు. విజయ్ అంటోనీ తండ్రి కూడా విజయ్ అంటోని చిన్నగా ఉన్నప్పుడు మరణించారు. ఇప్పుడు మీరా కూడా అలా అవ్వడంతో ఇలాంటి మంచి మనిషికి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.

vijay antony letter about his daughter

మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన విజయ్ ఆంటోని, తర్వాత నటుడిగా మారి సినిమాలు తీస్తూ ఉన్నారు. తెలుగులో బిచ్చగాడు, నకిలీ వంటి సినిమాలతో ఫేమస్ అయ్యారు. అలాగే తెలుగులో కూడా చాలా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్మాతగా మారి బిచ్చగాడు 2 సినిమా కూడా తీశారు. ఆ తర్వాత కూడా విజయ్ ఆంటోనీ కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు.

ALSO READ : “విజయ్ ఆంటోనీ” తో పాటు… తమ పిల్లల్ని కోల్పోయిన 7 నటులు..!