ఇంత పెద్ద హీరో అయ్యుండి ఈ హీరోయిన్స్ గురించి ఇలా మాట్లాడారా..? ఇది ఎందుకు పట్టించుకోలేదు..?

ఇంత పెద్ద హీరో అయ్యుండి ఈ హీరోయిన్స్ గురించి ఇలా మాట్లాడారా..? ఇది ఎందుకు పట్టించుకోలేదు..?

by Mounika Singaluri

Ads

దళపతి విజయ్ తమిళనాడులో సూపర్ స్టార్ వెలుగొందుతున్నాడు. తెలుగులో కూడా అతనికి మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆయన నటించిన లియో సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా లియో సినిమాలో యాక్ట్ చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.సినిమాలో త్రిషతో సీన్ చేసే అవకాశం వస్తుందేమో అని ఎదురు చూసా అన్నట్లు అతని మాటలు ఉన్నాయి.

Video Advertisement

దీనిపైన చాలామంది సినిమా ప్రముఖులు స్పందించారు. అలాగే త్రిష కూడా దీనిపైన స్పందించింది. అయితే ఇప్పుడు లియో సినిమాలో హీరో అయిన విజయ్ ఒకనాడు హీరోయిన్స్ జ్యోతిక, సిమ్రాన్ లపైన కూడా ఇదే విధమైన కామెంట్లు చేశారు అంటూ ఇప్పుడు ఆ టాపిక్ ను లేవనెత్తుతున్నారు.

విజయ వారసుడు సినిమాలో అన్నయ్యగా నటించిన శామ్ అందరికీ పరిచయమే. వీరు అంతకుముందు ఖుషి సినిమాలో కలిసి నటించారు. అందులో విజయ్ హీరోగా నటించగా శామ్ సైడ్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు విజయ్ తో తనకి మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. తర్వాత తాను హీరోగా మారినప్పుడు విజయ్ తో మాట్లాడాలని, తాను నటిస్తున్న సినిమాలో సిమ్రాన్, జ్యోతిక హీరోయిన్స్ గా నటిస్తుండగా దానిపై విజయ్ చేసిన కామెంట్లు గురించి ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి సినిమాలోనే రెండు హార్సెస్ తో (గుర్రాలతో సవారి) చేస్తున్నావుగా అంటూ విజయ్ కామెంట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఈ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు. లియో సినిమాలో చేసిన సాధారణ నటుడు ఒక కామెంట్ చేస్తే అందరూ విమర్శించారు కానీ సినిమాలోని హీరో ఇటువంటి కామెంట్లు చేస్తే ఎవరూ స్పందించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి జ్యోతిక కూడా ఒక ఇంటర్వ్యూలో కొంతమంది హీరోలతో నటించడం తనకి అంత కంఫర్ట్ గా ఉండదని చెప్పుకొచ్చింది. విజయ్ ని ఉద్దేశించే ఆ కామెంట్లు చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు.

Watch Video:

Also Read:“అల్లు అర్జున్” లో ఈ మార్పు ఎందుకు వచ్చింది..? దీనికి కారణం ఏంటి..?


End of Article

You may also like