ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదలైన చిత్రం లైగర్. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.
Video Advertisement
వీరిద్దరి కాంబినేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో పూరి తన డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ ని విజయ్ తో చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు లైగర్ చిత్ర పరాజయంతో ఆ సినిమా ప్రశ్నార్థకంగా మారింది.
లైగర్ ఫలితం తర్వాత పూరికి, విజయ్ దేవర కొండకు మధ్య గ్యాప్ పెరిగిందని సినీ వర్గాల సమాచారం.
ఈ నేపథయం లో గత కొన్ని రోజులుగా విజయ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు ఎవరిని ఉద్దేశించి పెడుతున్నాడా తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైగర్ చిత్రం కోసం తన సన్నాహానికి సంబంధించిన షూట్ వీడియోను పంచుకున్నారు. అనన్య తో జత కట్టిన విజయ్ ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపించాడు. దానికి సంబంధించిన స్టంట్స్‌ను విజయ్ ప్రాక్టీస్ చేసాడు.
ఆ వీడియోతో పాటు విజయ్ ఇలా వ్రాశాడు, “యాండీ మరియు అతని బాయ్స్ తో స్టంట్ లను మిస్ అవుతున్నాను. కష్టపడి పని చేయండి, మిమ్మల్ని మీరు ముందుకు తెచ్చుకోండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, తప్పుల నుండి నేర్చుకోండి, విజయాన్ని ఆస్వాదించండి, మీకు కావలసిన జీవితాన్ని గడపండి.” అనే కాప్షన్ తో పోస్ట్ చేసాడు విజయ్. అంతకు ముందు కూడా “ఒంటరి ఆటగాడ్ని” అని విజయ్ ఒక పోస్ట్ పెట్టారు. మరో వైపు లైగర్ పరాజయంతో నష్టపోయిన బయ్యర్లకు ఆ డబ్బును పూరి జగన్నాథ్ తిరిగి ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పూరికి ముంబై ని వదిలి గోవా లో ఉంటున్నట్లు సమాచారం.
watch video :