లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ విడుదలైన మూడు నెలల తరవాత ఈడీ అధికారులు ఇవాళ హైదరాబాద్లోని కార్యాలయంలో హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. చిత్ర దర్శకుడు, సహ నిర్మాత అయిన పూరీ జగన్నాథ్, నటి, సహ నిర్మాత ఛార్మీ కౌర్ కి ఇటీవల హైదరాబాద్ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. వారిద్దరిని విచారించిన తర్వాత విజయ్ ని కూడా విచారించారు అధికారులు.

Video Advertisement

‘లైగర్’ సినిమా బడ్జెట్, పారితోషికాలు, మరియు ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు అనే విషయాల పై ఈడీ విచారిస్తోంది. ఈ సినిమా నిర్మాణం విషయంలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు చాలా ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా లైగర్ సినిమాకి విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు వారికి సమాచారం అందిందని వినికిడి. ఈ నేపథ్యం లో హీరో విజయ్ దేవరకొండ ని కూడా అధికారులు విచారించారు.

vijay devarakonda comments on ED interrogation..!!

విచారణ అనంతరం విజయ్ మీడియాతో ముచ్చటించాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందిస్తూ.. “మీరు చూపించే ప్రేమ అభిమానం వల్ల వచ్చే పాపులారిటీతో అప్పుడప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా తెచ్చిపెడుతుంది. బట్ తప్పదు.. ఇది లైఫ్..! ఇదొక ఎక్స్పీరియన్స్ . ఈడీ అధికారులకు ఉన్న కొన్ని డౌట్స్ కు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. నన్ను మళ్ళీ రమ్మని అయితే చెప్పలేదు’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.

vijay devarakonda comments on ED interrogation..!!

లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా పూరి, విజయ్ మెడకు మాత్రం ఈ చిక్కులు తప్పడం లేదు. విజయ్, పూరిలకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు, పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ వస్తుందని అంతా అనుకున్నారు. చివరకు లైగర్ దారుణంగా బెడిసి కొట్టేసింది.దీంతో పూరి చేతులో ఇంకో సినిమా లేకుండా పోయింది. విజయ్ కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కించాలని బాగానే ఆరాటపడుతున్నాడు.