ఫ్యాషన్ ఐకాన్ గా విజయ్ దేవరకొండ ఇప్పటికే యూత్ పై చెరగని ముద్ర వేసాడు. అర్జున్ రెడ్డి మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండకి కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీస్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. చాలా సార్లు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వారికి ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. అలాగే విజయ్ దేవరకొండ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తనకు ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు అర్థం అయిపోతుంది.

bunny

తాజాగా ఈ రౌడీ హీరో మరో రికార్డు సృష్టించారు. ఇంస్టాగ్రామ్ లో చేరిన తక్కువ కాలం లోనే ఏకం గా 13 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. దీనితో ఆయన స్టైలిష్ స్టార్ బన్నీ సాధించిన రికార్డు ను బ్రేక్ చేసారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా పదమూడు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రౌడీ అన్న బన్నీ కంటే తక్కువ టైం లోనే ఆ మార్క్ కు చేరగలిగారు.