సాధారణంగా మన తెలుగు వాళ్ళు ఏ భాష సినిమాని అయినా సరే ఒక తెలుగు సినిమాని ఆదరించినంత బాగా ఆదరిస్తారు. అందుకే చాలా భాషల సినిమాలు తెలుగు భాషలో కూడా డబ్ అయ్యి విడుదల అవుతాయి. ఇప్పుడు అలాగే ఇంగ్లీష్ లో రూపొందించిన ఫాస్ట్ సినిమా తెలుగులో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • సినిమా : ఫాస్ట్ X (ఇంగ్లిష్)
 • నటీనటులు : విన్ డీజిల్, జాసన్ మోమోవా, జాసన్ స్టాథమ్, బ్రీ లార్సన్, చార్లీజ్ థెరాన్
 • నిర్మాత : యూనివర్సల్ పిక్చర్స్, ఒరిజినల్ ఫిల్మ్, వన్ రేస్ ఫిల్మ్స్, పర్ఫెక్ట్ స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
 • దర్శకత్వం : లూయిస్ లెటెరియర్
 • ఛాయాగ్రహణం : స్టీఫెన్ ఎఫ్.విండన్
 • సంగీతం : బ్రియాన్ టైలర్
 • విడుదల తేదీ: మే 18, 2023

Fast X movie-story-review-rating

స్టోరీ: 

డొమినిక్ టొరెట్టో (విన్ డీజిల్) తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఇంతలో రోమ్ నగరంలో చేయాల్సిన ఒక మిషన్ నుంచి ఏజెన్సీ నుంచి సమాచారం అందుతుంది. తను వెళ్లకుండా రోమన్‌ (టైరీస్ గిబ్సన్) లీడ్‌గా మిగతా టీమ్‌ను పంపిస్తాడు డొమినిక్. కానీ అది ఒక ట్రాప్ అని, ఒక గుర్తు తెలియని వ్యక్తి (జాసన్ మోమోవా) నుంచి తన టీమ్‌కు ప్రమాదం ఉందని సైఫర్ (చార్లీజ్ థెరాన్) ద్వారా తెలుస్తుంది.

Fast X movie-story-review-rating

ఆ గుర్తు తెలియని వ్యక్తి డాంటే రేయస్ అని, గతంలో తను చంపిన హెర్మన్ రేయస్ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా ఐదో భాగంలో విలన్) కొడుకు అని తెలుస్తుంది. మరి డొమినిక్ అతడి నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే ఈ యాక్షన్ మూవీ చూడాల్సిందే..

రివ్యూ:

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ మూవీ ఫ్రాంచైజీల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్’కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సిరీస్‌లో 10వ సినిమా ‘ఫాస్ట్ X’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైన్‌గా చూసుకుంటే చాలా చిన్న కథే. కానీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని చాలా గ్రాండ్‌గా, ఎంగేజింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రథమార్థంలో రోమ్‌లో జరిగే యాక్షన్ ఎపిసోడ్, క్లైమ్యాక్స్‌లో వచ్చే 40 నిమిషాల భారీ ఛేజ్ సీన్ విజువల్ ఫీస్ట్. లాజిక్‌ను మర్చిపోయి స్క్రీన్ మీదున్న మ్యాజిక్‌ను ఎంజాయ్ చేస్తాం.

Fast X movie-story-review-rating

విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ తర్వాత ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి కారణం వీక్ విలన్లే. కానీ ఆ లోటును ‘ఫాస్ట్ X’ తీర్చేస్తుంది. ‘ఆక్వామ్యాన్’లో హీరోగా నటించిన జాసన్ మోమోవా ఇందులో విలన్‌గా మెప్పించాడు. విలనిజం చూపిస్తూనే కామెడీ పండించాడు.

Fast X movie-story-review-rating

సినిమా ఎక్కడా స్లోగా కానీ, బోరింగ్‌గా కానీ అనిపించదు. ఎందుకంటే ఒకదాని తర్వాత మరొకటిగా ఛేజింగ్, ఫైటింగ్ ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి. ఇక చివర్లో కూడా కథను పూర్తి చేయలేదు. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ దగ్గర కథను ఆపేశారు. దీని తర్వాతి భాగం 2025లో విడుదల కానుందని ఇటీవల విన్ డీజిల్ ప్రకటించాడు.

Fast X movie-story-review-rating

యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏకంగా 161 మంది స్టంట్ డైరెక్టర్లు, కో-ఆర్డినేటర్లు పని చేశారు. ఆ గ్రాండియర్ స్క్రీన్ మీద కనబడుతుంది. సినిమాటోగ్రఫర్ స్టీఫెన్ ఎఫ్. విండన్‌ వీటిని చాలా ఎఫెక్టివ్‌గా తెరకెక్కించారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా రియలిస్టిక్‌గా ఉన్నాయి. బ్రియాన్ టైలర్ అందించిన సంగీతం కాస్త డల్ అయ్యింది.

 

ప్లస్ పాయింట్స్:

 • జాసన్ మోమోవా, విన్ డీజిల్ నటన
 • యాక్షన్ సీన్స్

Fast X movie-story-review-rating

మైనస్ పాయింట్లు:

 • రెగ్యులర్ స్టోరీ
 • మ్యూజిక్
 • సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

రేటింగ్:

3 /5

Fast X movie-story-review-rating

టాగ్ లైన్ :

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్‌కు ఈ సినిమా ఫుల్ ఫీస్ట్.. అలాగే నార్మల్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది.

watch trailer :