స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా ను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Video Advertisement

 

 

భన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్ర లో ఫహాద్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. హీరో చేసే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కు అడ్డుపడే పాత్రలో ఫహాద్ నటించాడు. అయితే పుష్ప తొలి భాగంలో ఈ నటుడు కేవలం సినిమా చివర్లో వస్తాడు. మొదటి భాగంలో ఈయన పాత్ర కు ఎక్కువగా స్కోప్ దక్కలేదు. కానీ అల్లు అర్జున్ కి ధీటైన పాత్రలో పుష్ప రెండవ భాగంలో ఈయన కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

vineeth srinivasan about pushpa movie..!!

అయితే తాజాగా పుష్ప మూవీ పై మలయాళ నటుడు, దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ స్పందించారు. ” పుష్ప చిత్రాన్ని నేను చెన్నై లోని పెరుంగుడి లో చూసాను. వినేమ చూస్తున్నప్పుడు ఫహద్ ఫాజిల్ కనిపించగానే జనాలు అరుపులు, కేరింతలతో థియేటర్ దద్దరిల్లి పోయింది. తెలుగులో అలా ఉండక పోవచ్చు కానీ.. నాకు ఆ క్షణం లో చాలా గర్వం గా అనిపించింది.” అని వినీత్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

vineeth srinivasan about pushpa movie..!!
ఇక తదుపరి పార్ట్ లో ఫాహద్‌ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు. ఫాహద్‌ మాత్రమే కాకుండా సునీల్ మరియు అనసూయ పాత్రలు కూడా పుష్ప 2 లో అత్యంత కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. మొత్తానికి పుష్ప రెండవ భాగం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.దాదాపు సంవత్సర కాలం పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన దర్శకుడు సుకుమార్.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.