సైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఈ “బేబీ” నటుడి సినిమా చూసారా.? అసలు ఈ సినిమా కథ ఏంటి.?

సైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఈ “బేబీ” నటుడి సినిమా చూసారా.? అసలు ఈ సినిమా కథ ఏంటి.?

by Harika

బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్, తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం జోరుగా హుషారుగా. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది అయితే పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం, భారీ సినిమాల మధ్యలో ఈ సినిమాని విడుదల చేయటం వలన యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

Video Advertisement

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 8 గురువారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమాని ఓటీటీ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కథ విషయానికి వస్తే సంతోష్ ( విరాజ్ అశ్విన్) అప్పుచేసి కన్సల్టెన్సీ కంపెనీకి డబ్బు కడతాడు కానీ ఆ కన్సల్టెన్సీ కంపెనీ మూతపడటంతో సంతోష్ కష్టాలు పెరుగుతాయి.

ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన సంతోష్ జీతం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అదే కంపెనీలో సంతోష్ ప్రియురాలు నిత్య ( పూజిత పొన్నాడ ) కూడా ఉద్యోగం చేస్తుంటుంది. నిత్యతో తన ప్రేమాయణాన్ని ఆఫీస్ కొలీగ్స్ దగ్గర దాచిపెడతాడు సంతోష్. అతను ఎందుకు అలా చేశాడు, జీవితంలో ఎదురైన కష్టాల నుంచి ఎలా పడ్డాడు, అప్పులను తీర్చగలిగాడా అన్నదే ఈ సినిమా కథ.

అయితే ఈ పాయింట్ తో గతంలో చాలా సినిమాలు రావడంతో రొటీన్ సినిమాగా భావించిన ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా ఆహ్వానించలేకపోయారు. ఈ సినిమాకి ప్రణీత్ సంగీతాన్ని అందించాడు, అను ప్రసాదు దర్శకత్వం వహించాడు. మరి ఓటీటీ ప్లాట్ఫారంలో ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, సినిమా ఎలాంటి రిజల్ట్స్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.


You may also like

Leave a Comment