ఇటీవల స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇందుగలడందు లేదని మొత్తం ప్రపంచమే ముంగిట వచ్చి కూర్చుంది. ఏది కావాలన్న చేతి వేళ్ళని టప టపా కదిలిస్తే చాలు మన పని అయిపోతుంది. అదేనండి.. ఆన్ లైన్ లో ఆర్డర్స్ పెట్టుకోవడం సంగతి గురించి. ఏది కావాలంటే అది ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు నిమిషాల్లో మన ముందుంటుంది.
టెక్నాలజీని ఎంత వరకు కావాలంటే అంతవరకు వాడుకుంటే పర్లేదు. కానీ ఒక్కోసారి ఈ టెక్నాలజీ వలన మనకి బద్ధకం కూడా ఎక్కువ అయిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. ఇదే బాపతుకు చెందిన బెంగుళూరు అబ్బాయి స్విగ్గిలో కాఫీ ఆర్డర్ చేసాడు.
వీధి చివర ఉన్న కాఫీ షాప్ కు వెళ్లి వేడి వేడిగా కాఫీ తాగితే అయిపోయేదానికి సదరు కస్టమర్ ఆ కాఫీని కూడా స్విగ్గిలోనే ఆర్డర్ చేసాడు. అయితే ఆ కస్టమర్ కి డెలివరీ బాయ్ తన అతి తెలివిని చూపించాడు. అయితే ఈ సంఘటనను సదరు కస్టమర్ తన ఫ్రెండ్ తో వాట్సాప్ లో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వాట్సాప్ చాట్ నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతోంది. అసలు ఈ వాట్సాప్ చాట్ ఏముందో ఇప్పుడు చూసేద్దాం.
సదరు కస్టమర్ నగరంలోని ఓ ప్రముఖ కాఫీ షాప్ నుంచి కాఫీని ఆర్డర్ చేసాడు. సదరు కాఫీ షాప్ కూడా అతని ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసింది. అయితే.. ఆ కాఫీని డెలివర్ చేయాల్సిన డెలివర్ బాయ్ మాత్రం ఒక్క కాఫీ కోసం అంత దూరం వెళ్లడం ఎందుకు అనుకున్నాడో ఏమో కాఫీని డుంజో అనే డెలివరీ యాప్ ద్వారా కాఫీని సదరు కస్టమర్ కి పంపించాడు. అంతే కాదు కస్టమర్ కి ఫోన్ చేసి కాఫీని డుంజో ద్వారా పంపిస్తున్నానని.. తనకు మాత్రం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసాడు. దీనితో కస్టమర్ ఖంగుతిన్నాడు. అయితే.. ఈ వాట్సాప్ చాట్ చూసిన నెటిజన్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.
Hello @peakbengaluru, the latest Bangalore update is broken. pic.twitter.com/GlDRJgdreh
— Omkar Joshi (@omkar__joshi) May 4, 2022