ఆచార్య సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవలే చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి చేసిన అల్లరి మాములుగా లేదు. అయితే.. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన అల్లరిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
అయితే ఇక చిరంజీవి అల్లరి చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. సాధారణంగా చిరంజీవి ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా హుందాగానే ఉంటారు. అప్పుడప్పుడు అల్లరి చేసి ఫన్ క్రియేట్ చేస్తుంటారు.
ఒక్కోసారి హీరోయిన్స్ పై ఆయన చేసే నాటీ కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. రచ్చ ఆడియో ఫంక్షన్ లో తమన్నా పై, తాప్సి మిషన్ ఇంపాజిబుల్ ఈవెంట్ లో తాప్సి పైనా ఆయన చేసిన సరదా కామెంట్స్ ను ప్రేక్షకులు ఇంకా మర్చిపోనే లేదు. ఈలోపే ఆయన మరోసారి తన చిలిపి కోణాన్ని బయటపెట్టారు. మీడియా ముందు ఫోజులు ఇవ్వబోతూ చిరు అల్లరి చేసారు. ఫోటోలు దిగిన తరువాత.. అందరు వెళ్లిపోతుండగా.. మరోసారి ఫోటోలు దిగాలంటూ కొందరు కోరారు. దీనితో చిరంజీవి వెళ్లిపోతున్నా పూజాని, రామ్ చరణ్ ను పిలిచారు. రామ్ చరణ్ ని రావద్దని సైగ చేసి పూజతో ఆమెను బంధించినట్లు ఫోజు ఇస్తూ ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Megastar #Chiranjeevi shares a light hearted moment with #PoojaHegde and #RamCharan at today's #Acharya event pic.twitter.com/WUoI6TclmT
— Daily Culture (@DailyCultureYT) April 26, 2022