రూ. 3 కోట్ల ఇంటికి మెట్లపై టాయిలెట్ పెట్టారు.. ఈ వైరల్ ఫోటో వెనక అసలు స్టోరీ ఏంటంటే?

రూ. 3 కోట్ల ఇంటికి మెట్లపై టాయిలెట్ పెట్టారు.. ఈ వైరల్ ఫోటో వెనక అసలు స్టోరీ ఏంటంటే?

by Anudeep

Ads

గృహమే కదా స్వర్గ సీమ అని పెద్దలు ఊరకనే అనలేదు. ఎన్ని చోట్లు తిరిగినా.. ఎక్కడెక్కడ తిరిగినా.. సాయంత్రం అయ్యేసరికి ఇంటికొచ్చి సేదతీరాకే స్థిమితపడతాం. మరి అలాంటి ఇంటిని సొంతంగా కట్టుకోవాలని అందరు కలలు కంటారు. తమ స్థోమతకు తగ్గ రీతిలో ఇంటిని కట్టుకుంటూ ఉంటారు.

Video Advertisement

అయితే.. డబ్బు ఉన్న వారు వారి డాబుకి తగ్గట్లే కట్టించుకుంటారు. కానీ వీరు మాత్రం మూడు కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టించుకున్నారు. కానీ.. టాయిలెట్ మెట్లపై ఉండడంతో.. ఈ ఫోటో తెగ వైరల్ అయిపోతోంది.

toilet 1

అసలు ఈ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఇల్లు కట్టించుకునేటప్పుడు లేదా కొనుక్కునేటప్పుడు వాస్తు చూసుకుంటారు. ఇంట్లో కిచెన్, బెడ్ రూమ్.. చివరకు బాత్ రూమ్స్ అన్ని సరిగ్గా ఉండేలా చూసుకుంటారు. అయితే.. వీటిల్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ఆ ఇల్లు కొనడమే మానుకుంటారు. మరి మెట్లపై టాయిలెట్ ఉంటె.. ఇంకా ఆ ఇంటిని ఎవరు కొంటారు చెప్పండి..? అందుకే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమెరికా లోని పెన్సిల్వేనియా కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు. ఇందుకు సంబంధించిన వివరాలని జిల్లో అనే వెబ్ సైట్ లో పెట్టాడు. మూడు బెడ్ రూమ్ లు ఉన్న ఈ ఇంటి ఖరీదు 420000 డాలర్లుగా పేర్కొన్నాడు. అంటే సుమారుగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది. అయితే.. ఈ ఇంట్లో మెట్ల మీద టాయిలెట్ ఉండడాన్ని కొందరు గమనించారు. కింద కార్పెట్ కూడా వేసి మరీ.. మెట్ల మీద టాయిలెట్ నిర్మించడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇంటిని చూసినవారు ఈ ఫోటోను నెట్టింట్లో పంచుకోగా.. అది వైరల్ అవుతోంది. ఇంటికి ఎంట్రీ లోనే ఇన్ని వింతలు కనిపిస్తే.. ఇంట్లో ఇంకెన్ని వింతలు ఉన్నాయో అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like