Ads
ఇటీవల అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడంతో.. చాలా మంది అబ్బాయిలకి పెళ్లి ఆలస్యం అయిపోతోంది. ముప్పయేళ్ల వయసు వస్తున్నా సంబంధాలు దొరకక.. దొరికిన సంబంధాలు కుదరక.. పెళ్లి ఆలస్యం అయిపోతోంది. దీనితో.. ఓ వ్యక్తికి కొత్త ఐడియా వచ్చింది
Video Advertisement
ఎలాగైనా సంబంధం దొరకాలని, పెళ్లి చేసుకోవాలని పట్టుదలగా ఉన్న ఈ యువకుడు తనకో వధువు కావాలి అంటూ ఊరంతా పోస్టర్లు వేయించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, మధురైలోని విల్లుపురానికి చెందిన ఎంఎస్.జగన్ ఇలా కొత్తగా ట్రై చేసి పోస్టర్ ను వేస్తున్నాడు. ఆ పోస్టర్లో తన పేరు, వయసు, ఉద్యోగం, జీతం, కులం, నక్షత్రం.. వంటి వివరాలను ముద్రించి.. తనకు వధువు కావాలి అంటూ పేర్కొన్నాడు. అయితే.. ఈ పోస్టర్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుండడంపై కూడా జగన్ స్పందించారు. ఈ పోస్టర్లపై వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోనని అన్నారట.
తాను ఐదు సంవత్సరాలుగా సరైన జోడి కోసం చూస్తున్నానని, ఇప్పటివరకూ సంబంధం దొరకలేదని చెప్పుకొచ్చాడు. వృత్తిరీత్యా తాను ఎన్నో పోస్టర్లను డిజైన్ చేసానని.. నాకంటూ సొంతంగా ఓ పోస్టర్ ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అని అనిపించిందని.. అందుకే సొంతంగా పోస్టర్ డిజైన్ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే.. ఊరిలోని ప్రధాన కూడళ్ల వద్ద ఈ పోస్టర్లను ఉంచినప్పటికీ.. ఇప్పటివరకూ ఎవరు కాంటాక్ట్ చేయలేదట. ఎవరో కొందరు మ్యారేజ్ కాంట్రాక్టర్లు మాత్రం కాల్ చేశారట. మొత్తానికీ ఇతగాని ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.
End of Article