విరాట్ కోహ్లీ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా.? ఆయన అన్నా వదినను ఎప్పుడైనా చూసారా…?

విరాట్ కోహ్లీ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా.? ఆయన అన్నా వదినను ఎప్పుడైనా చూసారా…?

by Mounika Singaluri

Ads

ఇండియన్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కరలేదు. ఇండియన్ అభిమానులు ఆయనను ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. క్రికెట్ చరిత్రలోనే రికార్డులు రారాజుగా విరాట్ కోహ్లీ ఎదిగారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్న రికార్డులు అన్ని విరాట్ కోహ్లీ ఇప్పుడు తన పేరు మీదకి మార్చుకుంటున్నారు. తాజాగా 50 సెంచరీలు చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఏ రికార్డు అయినా సరే విరాట్ కోహ్లీ ముందు దాసోహం అనక మానడం లేదు.

Video Advertisement

తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో విరాట్ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులందరినీ ఆకట్టుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు తన భార్య అనుష్క శర్మ స్టేడియంలో కూర్చుని కోహ్లీని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేసినా కూడా తండ్రికి దాన్ని అంకితం ఇచ్చే విధంగా ఆకాశం వైపు చూస్తాడు. చాలామందికి విరాట్ కోహ్లీ కుటుంబం అంటే కేవలం అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కూతురు మాత్రమే అనుకుంటారు. విరాట్ కోహ్లీ పూర్తి కుటుంబం గురించి చాలామందికి తెలియకపోవచ్చు.

విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ విరాట్ సక్సెస్ ని చూడకుండానే చనిపోయారు. అయితే విరాట్ కోహ్లీ తన తల్లి సరోజ్ కోహ్లీ తో కలిసి నివసిస్తూ ఉంటారు. అయితే అందరికీ విరాట్ కోహ్లీ తల్లి తండ్రి తన భార్య గురించి తెలుసు కానీ విరాట్ కోహ్లీ కి ఒక అక్క, ఒక అన్న ఉన్నారనే సంగతి పెద్దగా తెలియకపోవచ్చు. విరాట్ కోహ్లీ అక్క పేరు భావన కోహ్లీ ధింగ్ర. అలాగే విరాట్ కోహ్లీ అన్నయ్య పేరు వికాస్ కోహ్లీ. కోహ్లీ వదిన పేరు చేతన కోహ్లీ. కోహ్లీ వదిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ కూడా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.


End of Article

You may also like