హీరో విశాల్ తమిళం లో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగు లో కూడా అంతే క్రేజ్ ఉంది. పందెం కోడి, పొగరు వంటి సినిమాల్లో తెలుగు లో తన మార్కెట్ పెంచుకున్నాడు విశాల్. విశాల్ ప్రతి సినిమా తెలుగు లో కూడా విడుదల వుంటూ ఉంటుంది. అయితే కెరీర్ ఆరంభం లో ఉన్నా జోరు విశాల్ ఇప్పుడు చూపించలేకపోతున్నాడు. విశాల్ కి మంచి హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది.

Video Advertisement

 

 

విశాల్ తాజాగా ‘లాఠీ’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తొలి షో నుంచే లాఠీ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. తొలిరోజు లాఠీ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో రూ 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం 65 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది.వాస్తవానికి విశాల్ కు మినిమం రేంజ్ వసూళ్ళు వస్తాయి. ఇక శుక్రవారం నాడు తెలుగు సినిమా లు 18 పేజెస్ మరియు ధమాకా రిలీజ్ ఉండటం వల్ల వసూళ్ళు మరింత తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

vishal lathi movie negativity..

కానీ దీనికి కారణం నెగటివ్ పబ్లిసిటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. విశాల్ గురించి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతోంది. విశాల్ కుప్పం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధం గా విశాల్ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, కానీ తన ఓట్ మాత్రం జగన్ కే అని అన్నాడు. దీంతో అతడికి నెగటివిటీ పెరిగిపోయింది. ఆ ఎఫెక్ట్ అతడి సినిమాపై పడిందని తెలుస్తోంది. ఫలితంగా లాఠీ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద దారుణమైన నంబర్స్ నమోదు చేసుకుంది.

vishal lathi movie negativity..

గతంలో ఇలాంటి పరిస్థితి హీరో నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం చిత్రానికి ఎదురైంది. ఆ చిత్ర దర్శకుడు శేఖర్ తాను రాజశేఖర్ రెడ్డి అభిమానిని అని చెప్పుకోవడంతో అతడి పాత వీడియో లు బయటకి వచ్చి పెద్ద రచ్చే జరిగింది. నితిన్ సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపింది. నితిన్ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు.