హీరో విశాల్ నటించిన చక్ర సినిమా మరియు దాని ప్రొడ్యూసర్స్ మీద లైకా అనే నిర్మాణ సంస్థ కాపీ రైట్స్ ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. ఆ మూవీ డైరెక్టర్ తొలుత సినిమా కథ ను తమ కే వినిపించి తమ తోనే నిర్మిస్తా అని చివరకు దానిని విశాల్ నిర్మించాడన్నది ఆ సంస్థ చేసిన ప్రధాన ఆరోపణ. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు లైకా సంస్థ వేసిన కేసులు, ఆరోపణలు అన్ని తప్పుడుగా కనిపిస్తున్నాయని కేసును కొట్టి వేసింది. దానితో పాటు లైకాకు ఐదు లక్షల జరిమానా విధించింది.


దీనిపై హీరో విశాల్ తన ట్విట్టర్ లో స్పందించారు. తన కు కోర్టుల పట్ల విశ్వాసం ఉందని ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని అది ఈరోజు నిజమైందని నాపై లైకా సంస్థ వేసిన కేసులు తప్పుడని న్యాయస్థానం నమ్మిందని అందుకే ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించిందని . ఇదంతా లైకా ప్రొడక్షన్స్ నన్ను మానసికంగా వేధించినందుకేనని అనుకుంటున్నట్లు విశాల్ చెప్పారు.