మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాంచి ఊపుమీద ఉన్నాడు. లాక్ డౌన్ కు ముందు హిట్ సినిమాతో హిట్టు కొట్టి లాక్ డౌన్ తర్వాత పాగల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన అతడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. సినిమా టాక్ ఎలా ఉందన్న విషయం పక్కకు పెడితే ఇక తన సినిమా మామూలుగా ఉండదని, మూసుకున్న థియేటర్స్ తెరిపిస్తానని తప్పైతే పేరు మార్చుకుంటా అంటూ అతడు చేసిన కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లోనే కాక సాధారణ ప్రేక్షకుల్లో కూడా పెద్ద దుమారమే లేపాయి.

Video Advertisement

viswak-sen-real-name

viswak-sen-real-name

సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం అంత ఓపెన్ గా ఛాలెంజ్ చేయడమెందుకని అనుకుంటున్నారు ప్రేక్షకులు.నిజానికి విశ్వక్ అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు తన తండ్రి సూచన మేరకు సంఖ్యాశాస్త్రం ప్రకారం తన పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నాడు. సో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తన పేరును మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం. మరోవైపు పాగల్ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కనుక విశ్వక్ ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు.