Ads
విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన “బూ” సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తమిళ డైరెక్టర్ విజయ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
Video Advertisement
- చిత్రం : బూ
- నటీనటులు : విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్, పృథ్వీ రాజ్
- నిర్మాత : రామాంజనేయులు, రాజశేఖర రెడ్డి
- దర్శకత్వం : విజయ్
- సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
- విడుదల తేదీ : మే 27, 2023
- ఓటీటీ వేదిక : జియో సినిమా
స్టోరీ:
తల్లి వూరికెళ్లడంతో హలోవీన్ పార్టీకి రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్రెండ్స్ ని ఇంటికి ఆహ్వానిస్తుంది. రకుల్ తన ఇంటిని హాలోవీన్ కోసం అస్థిపంజరాలు, దెయ్యపు ఆకారాలతో అలంకరిస్తుంది. ఆ తరువాత వారంతా కలిసి ఒక హార్రర్ పుస్తకం తీసి కథలు చదువుతూ ఉంటారు. అయితే ఆ కథ లోని ఒక్కో దెయ్యం నిజ జీవితంలో వాళ్ళ ముందుకొచ్చేసి బెదరగొడతాయి.
అప్పుడు ఒక దెయ్యాన్ని వదిలించుకోవాలంటే ఇంకో దెయ్యం కథ చదవాలి. ఇలా చదువుకుంటూ వెళ్తుంటే పారానార్మల్ సైంటిస్టు విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఈ కథ ఏమిటి? దెయ్యాల ఉనికి మీద ప్రయోగాలు చేసే విశ్వక్ సేన్, తను ప్రేమించిన ఒక్కో గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కోల్పోతూ వచ్చాడు? చివరికి ఈ నలుగురు స్నేహితురాళ్ళు ఆ దెయ్యాల నుంచి ఎలా తప్పించుకున్నారు వంటి సమాధానాల కోసం మిగతా సినిమా చూడాలి..
రివ్యూ:
రకుల్ హారర్ బుక్ లో చదివే స్టోరీస్ అన్ని ఆసక్తికరంగానే వున్నాయి. కానీ అంతా భయపెట్టే విధంగా లేవు. ఈ సినిమాకి హాలోవీన్ నేపథ్యం ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. ఈ మొత్తం కథలో హార్రర్ దృశ్యాలేం భయపెట్టేవిగా వుండవు. కానీ సస్పెన్స్ తో ఆసక్తికరంగా వుంటాయి. అయితే నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. విశ్వక్ సేన్ పాత్ర చివర్లో మాత్రమే వస్తుంది.
గంటన్నర నిడివితో వచ్చిన ఈ చిత్రం లో విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి. ముఖ్యంగా కెమెరా వర్క్, ఎడిటింగ్, కళా దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్స్, సీజీ వర్క్ క్వాలిటీ బాగున్నాయి. దర్శకుడు విజయ్ రైటింగ్, మేకింగ్ పాత విలువలు జొరబడకుండా ఆధునిక దృక్పథంతో నిర్వహించడం ఈ హార్రర్ కి ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్
- స్టార్ కాస్టింగ్
- క్లైమాక్స్
- సినిమా నిడివి
మైనస్ పాయింట్స్
- కొత్తదనం లేని సన్నివేశాలు
- పేలవమైన కథ
రేటింగ్: 2 .5 /5
ట్యాగ్ లైన్: ఒక నార్మల్ హారర్ కామెడి మూవీ చూడాలి అనుకొనే వారు ఒక్కసారి చూడొచ్చు.
Watch trailer:
End of Article