“విస్మయి ఫుడ్” వెనుక ఉన్న వ్యక్తి గురించి ఈ విషయాలు తెలుసా..? ఈ ఛానల్ ఎప్పుడు మొదలుపెట్టారంటే..?

“విస్మయి ఫుడ్” వెనుక ఉన్న వ్యక్తి గురించి ఈ విషయాలు తెలుసా..? ఈ ఛానల్ ఎప్పుడు మొదలుపెట్టారంటే..?

by Mohana Priya

Ads

హలో ఫుడీస్. వెల్కమ్ టు విస్మయి ఫుడ్స్. ఈ మాటలు వినంగానే ఆ వ్యక్తి గొంతు కూడా గుర్తు వస్తుంది. అంతగా ఫేమస్ అయిపోయారు. యూట్యూబ్ లో కుకింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ ఈ ఛానల్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో రకమైన వంటకాలని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించారు తేజ పరుచూరి. తేజ పరుచూరి అంటే చాలా మందికి తెలిసే అవకాశం లేదు. అదే, విస్మయి ఫుడ్ వ్యవస్థాపకులు తేజ పరుచూరి అంటే అందరూ గుర్తుపడతారు. ఆయన చెప్పిన వంటకాల్లో ఏదైనా ఒక వంటకం అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ట్రై చేసి ఉంటారు. రోజుకి ఒక కొత్త వంటకంతో మన ముందుకి వస్తూ ఉంటారు.

Video Advertisement

vismai food founder teja paruchuri

సీజన్ కి తగ్గట్టుగా స్పెషల్ వంటకాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానల్ వెనకాల ఉన్న వ్యక్తి పేరు తేజ పరుచూరి. తేజ పరుచూరి ఈ యూట్యూబ్ ఛానల్ ని 2016 లో మొదలుపెట్టారు. తేజ కుటుంబం అంతా కూడా హోటల్ బిజినెస్ లోనే ఉన్నారు. అందుకే తేజకి చిన్నప్పటినుంచి వంటల మీద ఆసక్తి ఏర్పడింది. తేజ మధ్యలో టెలివిజన్ ఛానల్స్ లో కూడా పనిచేశారు. కానీ అందులో వేరే విభాగాల్లో తేజ పనిచేశారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తేజ పనిచేశారు. స్పైడర్ మాన్ హోమ్ కమింగ్ సినిమాలో హీరో టామ్ హోలాండ్ కి తేజ డబ్బింగ్ చెప్పారు. ఇంకా ఎన్నో సినిమాల్లో ఎంతో మందికి తేజ డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

vismai food founder teja paruchuri

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిన్నప్పటినుండి కూడా వాళ్ళ హోటల్ లో వండే వంటకాలని గమనించేవారు అని తేజ చెప్పారు. తన కుటుంబం నుండి కేవలం ఇద్దరు మాత్రమే ఫుడ్ బిజినెస్ లో అడుగు పెట్టారు అని తెలిపారు. తేజ తన కుకింగ్ వీడియోస్ కి వచ్చే అన్ని కామెంట్స్ కూడా చదువుతారు. గతంలో కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా తనే చేసుకునే వారు తేజ. కానీ ఇప్పుడు బిజీ అయిపోవడంతో ఇందుకు ప్రత్యేకంగా కెమెరామెన్, ఎడిటర్లు ఉంటారు. ఈ ఛానల్ ఇంత పాపులర్ అవ్వడానికి వెనుక ఏడు సంవత్సరాల కష్టం ఉంది. ప్రతిరోజు కొత్త కొత్త రెసిపీస్ తో ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటారు. తేజ తన యూట్యూబ్ ఛానల్ కి నాలుగు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ALSO READ : శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు..! మహాకవి అని అందుకే అంటారు ఏమో..!


End of Article

You may also like