Ads
Vivaha panchmi : వివాహ పంచమి అనేది శ్రీరాముడు సీతాదేవి యొక్క వైవాహిక బంధానికి అంకితం చేయబడిన పవిత్రమైన హిందూ పండుగ. ఇది హిందూ సంవత్సరం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోనూ సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూ ర్ లోని అత్యంత వైభవంగా పూజలు వేడుకలు జరుపుకుంటారు.
Video Advertisement
రాముడి బారాత్ ఊరేగింపు అయోధ్య నుంచి వివాహ వేడుకలు జరిగే జనక్ పూర్ వరకు ఒక ఆలయం నుండి మరొక ఆలయానికి తీసుకు వెళ్ళబడుతుంది. ఈ కార్యక్రమం రామ్ వివాహ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. రాముని అనుగ్రహం కోసం భక్తులు వివిధ భజనలు పాడతారు. సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూర్ లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.అక్కడ ఉన్న వివిధ దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మిథిలాంచల్ లోని గంగాసాగర్, ధనుష్ సాగర్ మరియు అర్గాజా వంటి పవిత్ర సరస్సులలో ప్రజలు స్నానం చేస్తారు.
ప్రాణప్రతిష్ట ఆచారాల తర్వాత దేవతా విగ్రహాలను వధూవరుల వలె అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్లి వారి వివాహాన్ని ప్రసిద్ధ జానకి ఆలయంలో నిర్వహిస్తారు.ఈ సంవత్సరం వివాహ పంచమి డిసెంబర్ 17 2023 ఆదివారం జరుపుకోనున్నారు. మార్గశిర మాసంలోనే శుక్లపక్షపంచమి తిధి డిసెంబర్ 16వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 5:33 గంటలకి ముగుస్తుంది. కాబట్టి వివాహ పంచమి 17 డిసెంబర్2023 న మాత్రమే జరుపుకుంటారు.
పూజకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉదయం 8: 24 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:1 నిమిషం వరకు ఒక ముహూర్తం. మధ్యాహ్నం 1: 34 నుంచి 2:52 వరకు మరొక ముహూర్తం సాయంత్రం 5:02 నుంచి 10: 34 వరకు మరొక శుభ ముహూర్తం ఉన్నాయి. అయితే కొసమేరుపు ఏమిటంటే ఇంత శుభప్రదంగా చేసుకునే ఈ వివాహ పంచమి రోజు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకి పెళ్లి చేయాలని కోరుకోరు. ఎందుకంటే సీతారాముల కళ్యాణం తర్వాత ఆ దంపతులు సుఖపడలేదు సరి కదా నానా కష్టాలు పడ్డారు అటువంటి కష్టాలు తమ పిల్లలు పడకూడదని విశ్వాసంతో ఈరోజు ఏ తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయరు.
End of Article