మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్స్, పాటలు దుమ్ము లేపుతున్నాయి. మితి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ వేగవంతం చేసారు మేకర్స్.

Video Advertisement

అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి U /A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. అయితే సెన్సార్ టాక్ ని బట్టి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిరు అభిమానులు పండగ చేసుకొనేలా ఈ చిత్రం తెరకెక్కిందని వారు అన్నట్లు సమాచారం. చిరు డాన్స్ గురించి కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

waltair veerayya censor talk..

బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ఇప్పటికే బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక చిరు, రవి తేజ కలిసి నటిస్తుండటం తో జనాల్లో చాలా హైప్ వచ్చింది. వారిద్దరిని తెరపై చూడటం పండగల ఉంటుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

waltair veerayya censor talk..
వాల్తేరు వీరయ్య సినిమాను యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో అదే టైటిల్‌తో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే హిందీలో విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఇంట్రడక్షన్ టీజర్ అదరగొట్టింది. ఈ చిత్రం తో పాటు బాలయ్య- గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’, వంశి పైడిపల్లి- విజయ్ ‘వారసుడు’ సంక్రాంతి బరిలో నిలవనున్నాయి.