మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

 

అయితే వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం లో చిరు ని అలాగే చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. ‘వాల్తేరు వీరయ్య’.. సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. అయితే ఈ చిత్రంసెన్సార్ పూర్తి చేసుకుంది. దాంతో పాటు రన్ టైమ్ ఎంతనేది మూవీ మేకర్స్ ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్‌ను మీడియాకు విడుదల చేశారు.

waltair veerayya run time locked..this is plus or minus..??

వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ వాళ్ల టాక్ బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం వాల్తేరు వీరయ్య రన్‌ టైం ఎంతనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం రన్‌ టైం 2 గంటల 40 నిమిషాలు. అంటే 160 నిమిషాలు. ఈ లెక్కన సిల్వర్ స్క్రీన్‌పై చిరంజీవి, రవితేజ, శృతిహాసన్‌ టీం ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మామూలుగా ఉండదని తెలిసిపోతుంది.

waltair veerayya run time locked..this is plus or minus..??

ప్రస్తుతం వస్తున్న కమర్షియల్ మూవీస్ అన్నీ 150 నిమిషాల లోపే వస్తున్నాయి. కానీ ఈ మాస్ ఎంటర్టైనర్, వినోదం మేళవించిన ఈ చిత్రం పై నమ్మకం ఉంచారు మేకర్స్. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు రవితేజ. సెకండాఫ్ లో ఇతడి పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందట. అలా రవితేజ పాత్ర నిడివి పెరిగింది. ఫలితంగా రన్ టైమ్ ఎక్కువైంది. కానీ సినిమా మీద నమ్మకం తో చిరు, మేకర్స్ అదే రన్ టైం తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. మరి ఈ రన్ టైం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందో.. లేదో చూడాలి..