Ads
ఎంతోమంది చిత్రపరిశ్రమకు అవకాశాల కోసం వస్తుంటారు. కొంతమంది మాత్రమే తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారు మన తెలుగు పరిశ్రమలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ఇదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించిన వ్యక్తి షేక్ శ్రీను.
Video Advertisement
ఈయన సాధారణంగా చిత్రంలో విలన్ గ్రూపులోని సైడ్ క్యారెక్టర్ గా కనిపిస్తుంటారు. ఈయన బాడీ స్టైల్ హీరోలలో తలదన్నే విధంగా ఉంటుంది. ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.
షేక్ శ్రీను బాడీ బిల్డింగ్ తో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న వయస్సు నుంచి ఈయనకి నందమూరి తారక రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి నటన అంటే మక్కువ ఎక్కువ. రియల్ ఫైటర్స్ అయిన సినిమా హీరో అర్జున్, సుమన్ మరియు భానుచందర్ సినిమాలు ఎక్కువగా చూసేవారట. ఈయన ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన జాకీచాన్ మరియు హీరో అర్జున్ యాక్షన్ వల్ల కలిగిందట. ఇప్పటికి కూడా అర్జున్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారట షేక్ శ్రీను.
ఈయన సినీ ఇండస్ట్రీకి రావడానికి కారణం వైజాగ్ సినీ ఆర్టిస్ట్ ప్రసన్నకుమార్. షేక్ శ్రీను మొదటి చిత్రం బాలయ్య బాబు నటించిన నరసింహ నాయుడు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ దృష్టిలో పడడం ద్వారా ఈయన సినిమాలు కంటిన్యూ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. షేక్ శ్రీను అసలు పేరు షేక్ రెహమాన్. ఈయన భద్ర, ఆప్తుడు, మిర్చి, జయ జానకి నాయక వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
షేక్ శ్రీను గురించి ఎవరికీ తెలియని నిజం ఏంటంటే… ఈయన కేవలం నటుడే కాదు, ఈయన వైజాగ్ లో పోలీస్ విభాగంలో “సబ్ ఇన్ స్పెక్టర్” బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఒకపక్కన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో కూడా కొనసాగుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
End of Article