సాధారణంగా మనం బయటకు వెళ్లినప్పుడు ఏదైనా ఒక డ్రెస్ ని వేసుకుంటాం. తర్వాత బయట నుండి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ మార్చుకొని మనకి సౌకర్యంగా ఉండే బట్టలని వేసుకుంటూ ఉంటాం. అయితే చాలా మంది బయటకు వెళ్లి వచ్చిన బట్టల్ని ఎండలో ఆరబెట్టి మళ్ళీ మడతపెట్టి దాచేసుకుంటూ ఉంటారు.
ఇలా వేసుకు వచ్చిన బట్టల్ని మనం మరొక సారి ఉపయోగించుకో వచ్చు. దీని వలన ఏ ఇబ్బంది ఉండదు. కానీ రాత్రి నిద్ర చేసిన బట్టలు మాత్రం ఉతక్కుండా మళ్ళీ వాడకూడదు. ఎందుకు రాత్రి నిద్ర చేసిన బట్టల్ని మళ్ళీ వేసుకోకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
రాత్రి మనం నిద్ర పోయేటప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో కలలు కూడా వస్తూ ఉంటాయి. పైగా మన యొక్క శరీరం రకరకాల విసర్జలను వదులుతుంది. మన యొక్క శరీరం కూడా పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఎన్నో చెడు ఆలోచనలు కూడా ఉంటాయి. అలానే మంచం మీద నిద్రపోయేటప్పుడు మంచానికి ఉండే దుమ్ము, ధూళి అన్ని కూడా మన బట్టలు కి అంటుకుంటాయి.
ఆ దుమ్ము వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక రాత్రి నిద్ర చేసిన బట్టలు ఎప్పుడు మళ్ళీ వేసుకోవద్దు. ఉదయం స్నానం చేసేటప్పుడు రాత్రి వేసుకున్న బట్టలని కాస్త నీళ్ళల్లో జాడిస్తే మంచిది. ఎలాగో దానికి ఎక్కువ మురుకు ఉండదు.
కాబట్టి నీళ్ళల్లో వేసి జాడించి ఆరేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రాత్రి నిద్ర చేసిన బట్టలు ఎప్పుడు కూడా మళ్ళీ వేసుకోకండి. ఇది కేవలం పెద్దలకి మాత్రమే కాదు పిల్లలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తే మంచిది. ఇలా ఈ మంచి అలవాటుని అలవాటు చేసుకోవడం వల్ల సమస్యలు ఏమి రావు.