ప్రతి పద్ధతి కూడా మారుతూ వస్తోంది. పూర్వం మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని ఈ కాలం లో మనం పాటించడం లేదు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా రూల్స్ ని అతిక్రమించేవారు కాదు. పూర్వకాలంలో ఆచారాలు కూడా ఎక్కువగా ఉండేవి. పెద్దలు ఏం చెప్తే అదే పిల్లలు వినేవారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చినట్లుగా.. తగ్గట్టుగా అనుసరిస్తున్నారు.

Video Advertisement

బట్టల విషయంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. బట్టలు కట్టుకునే విధానం మొదలు బట్టల్ని ఒకరికొకరు మార్చుకునే దాకా చాలా కొత్త కొత్త పద్ధతులని ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు అనుసరిస్తున్నారు.

అయితే ఒక్కొక్కసారి మన బట్టలని మనం ఇతరులకి ఇస్తూ ఉంటాం. సాధారణంగా ఎవరికైనా నచ్చినా లేదంటే మనం వారికి అవసరమై బట్టల్ని ఇస్తూ ఉంటాం. అయితే ఒకరి బట్టలను మరొకరు వేసుకోవడం వలన ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరకు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఏ రోజు దుస్తులు ని ఆరోజు ఉతుక్కునేవారు. ఓ రోజు వేసుకున్న బట్టలని మరొక రోజు వేసుకునేవారు కాదు. కానీ ఈ మధ్య ఒకరి బట్టల్ని మరొకరు తీసుకుంటున్నారు. అయితే ఉతికిన బట్టల్ని మరొకరు కట్టుకోవచ్చు. కానీ ఒకరు వేసుకున్న తర్వాత ఉతకకుండా ఆ బట్టల్ని ఇంకొకరు వేసుకుంటే దాని వలన పీడలు కలుగుతాయి.

మానవుడు శరీరానికి కొన్ని పాపాలు అంటుకుని ఉంటాయి. తల దువ్వుకున్న తర్వాత ఇంట్లో ఆ జుట్టు ఉండకూడదు. ఆ జుట్టు ఉంటే సమస్యలు వస్తాయి. అలానే ఒకరు కట్టుకున్న బట్టలని కూడా మరొకరు ఉతకకుండా కట్టుకోకూడదు, అలా చేస్తే దుస్తులు ఇచ్చిన వ్యక్తికి ఉన్న పీడలన్నీ కూడా ఈ వ్యక్తికి అంటుకుంటాయి. ఎవరు కూడా పీడలనే కోరుకోరు అటువంటి వాటికి దూరంగా ఉండాలని.. హాయిగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలానే ఒకరి చెప్పులు మరొకరు వేసుకోకూడదు అలా చేస్తే దరిద్రం తో పాటుగా క్షుద్ర పీడలు కూడా సంభవిస్తాయి.