మహిళలోకానికే ఆదర్శం.. ఈ వెదర్ వుమెన్ గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

మహిళలోకానికే ఆదర్శం.. ఈ వెదర్ వుమెన్ గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by Harika

Ads

ఇంటి గడప దాటడానికి కూడా ఆడవాళ్లు ఆలోచించే కాలంలో ఒక మహిళ ఏకంగా విదేశాలకు వెళ్లి చదువుని కొనసాగించింది అంటే అది మామూలు విషయం కాదు. ఆమె విదేశాలలో చదువుకున్న విజ్ఞానాన్ని అంతా స్వదేశంలో వినియోగించి ప్రజలు ప్రకృతిని మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సహాయపడే పరికరాలని తయారు చేయడంలో వినియోగించింది.

Video Advertisement

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల పేర్లలో అన్నామణి పేరు కూడా ఉంటుంది. ఈమె 1913లో కేరళలోని ట్రావెన్ కోర్ లో జన్మించారు. ఆడవాళ్లు గడప దాటటమే గగనం అనుకునే రోజులలో ఆమె తనకి ఇష్టమైన వాతావరణ శాస్త్రాన్ని చదవడం కోసం విదేశాలకు సైతం వెళ్లారు.

annamani

ఆమెది సంపన్నమైన కుటుంబమే కానీ ఆమె అందరిలాగా పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపాలి అనుకోలేదు. ఉన్నత చదువు కోసం విదేశానికి వెళ్లాలనుకుంది. అందుకు కుటుంబం వ్యతిరేకించనూలేదు అలాగని ప్రోత్సహించనూలేదు. విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ పొందటానికి ముందు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని నోబెల్ పురస్కార గ్రహీత సి.వి.రామన్ లాబరేటరీ లో డైమండ్ లక్షణాలపై అధ్యయనం చేశారు. ఆపై యూకే కి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాల పాటు వాతావరణ పరికరాలకు సంబంధించిన ప్రతి విషయం పై తన అధ్యయనాన్ని కొనసాగించారు.

annamani

1948లో స్వదేశానికి వచ్చిన ఆమె వాతావరణాన్ని కొలిచే పరికరాలను భారత్ సొంతంగా రూపొందించేందుకు సహాయపడ్డారు. అప్పటివరకు ఆ పరికరాలని బ్రిటన్ యూరప్ లో నుంచి దిగుమతి చేసుకునేది భారత్. ఓజోన్ పొరను పరిశీలించడానికి శాస్త్రవేత్తలు పడుతున్న ఇబ్బందులను గమనించి దానిని సులభతరం చేసే ఓజోన్ సాండ్ అనే పరికరాన్ని ఆమె 1964లో రూపొందించారు. కానీ ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు.

annamani

ఆమె సహాధ్యాయులు ఆమెకి సరైన గౌరవం ఇచ్చేవారు కాదు. హిందూ మహాసముద్రంలో మారుతున్న కాలాలను అధ్యయనం చేసేందుకు భారతీయ నౌకాదళం షిప్ లోకి వెళ్లాలని అనిపించేది కానీ అప్పట్లో మహిళలకు అనుమతి ఉండేది కాదు అని ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదన చెప్పుకొచ్చారు. 2001లో మరణించిన ఈ ఇండియన్ వెదర్ వుమెన్ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిణి గానే ఉండిపోయారు సంపాదించిన జ్ఞానాన్ని తర్వాత తరం వారికి అందించడంలో తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

https://www.bbc.com/telugu/articles/cmmpmv0554eo.amp


End of Article

You may also like