ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.

ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.

by Anudeep

Ads

శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు అని ప్రస్తుత పెళ్లి ఆహ్వాన పత్రికలో చూస్తుంటాం దానికి భిన్నంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక చూస్తే అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుస్తుంది. మే 9, 1946 న ప్రచురించిన ఈ పత్రికలో ‘శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు’ అని ఉండాల్సిన చోట, ‘శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం’ అనే జాతీయోధ్యమ నినాదాలతో ఆ పత్రికను ముద్రించారు.

Video Advertisement

ఆహ్వాన పత్రిక మొదటి లైన్ లో ‘వందేమాతరం’ అనే జాతీమోధ్యమ నినాదానం చూస్తుంటే 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయం, ఆ పరిస్థితుల్లో దేశంలోని పౌరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆహ్వాన పత్రిక చివర్లో‘దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నాం’ అనే లైన్ చూస్తుంటే, ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి ,నిత్యవసరాల కొరత వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.. తాడంకి గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో ఇలా పెళ్లి పత్రకను ముద్రించి బంధువుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించారు.


End of Article

You may also like