Ads
ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో అవసరాలు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. అప్పటిలాగా అంత కష్టపడాల్సిన పరిస్థితులు లేవు. కానీ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎక్కడో ఒకచోట కొన్ని ఇబ్బందులు మాత్రం జరుగుతూనే ఉంటాయి.
Video Advertisement
ఎంత అందుబాటులోకి అన్ని అవసరాలను తీసుకురావాలి అని ప్రయత్నం చేసినా కూడా కొన్ని చోట్ల ప్రజలు ఏదో ఒక రకమైన సమస్యలకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వాటిలో వాష్ రూమ్ సమస్య ఒకటి. వాష్ రూమ్ ప్రతి చోట అందుబాటులో ఉండేలాగా కొంత కొంత దూరంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. దీని వల్ల ఎమర్జెన్సీ సమస్య కొంత వరకు తగ్గింది.
అవసరం అయితే దగ్గరలో వాష్ రూమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. కానీ ప్రతి చోట ఇలాంటి సదుపాయాలు ఉండవు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో కొన్ని సార్లు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. గుళ్లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా మహిళలు అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పడతారు. అయితే అలాంటి సమస్యని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తూ ఇటీవల ఒక సంస్థ ఒక ఉపాయం కనుక్కుంది. అయోధ్య ఆవరణలో లతా మంగేష్కర్ చౌక్ దగ్గరలో ఈ సదుపాయాన్ని కల్పించారు.
రామ మందిరానికి చాలామంది వస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో వాష్ రూమ్ ఎమర్జెన్సీ ఉంటుంది అనే కారణంతో పింక్ పీ అనే టాయిలెట్స్ సదుపాయాన్ని కల్పించారు. జనవరి 20 వ తేదీన ఇవి అందుబాటులోకి వచ్చాయి. అయోధ్య ఆవరణలో 8 చోట్ల 32 టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. హైజీన్ లైఫ్ స్టైల్ స్పిరిట్ ఎల్.ఎల్.పి అనే సంస్థ ఈ టాయిలెట్స్ ని ఏర్పాటు చేసింది. ఇది ఆడవారు, మగవారు ఇద్దరు వాడుకోవచ్చు. ఒక చోట నా4 టాయిలెట్స్ ఉంటే, అందులో 3 ఆడవారికి, 1 మగవారికి వాడుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే ఇది కేవలం వాష్ రూమ్ ఎమర్జెన్సీకి మాత్రమే.
ఈ టాయిలెట్ లో ఒక చైర్ లాంటిది ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లే ముందు డోర్ కి ఉన్న కాయిన్ బాక్స్ లో పది రూపాయల కాయిన్ వేస్తే ఒక కవర్ లాంటిది వస్తుంది. వాష్ రూమ్ లో అందులో నింపి పక్కనే ఉన్న చెత్తబుట్టలో పడేయాలి. ఆ కవర్ లో వేసాక అది సాలిడిఫై అయిపోతుంది. ఈ టాయిలెట్ మీద ఒక ఇన్స్ట్రక్షన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఈ టాయిలెట్ ఎలా వాడాలి అనేది కూడా రాసి ఉంటుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ సీఈఓ అయిన సందీప్ గుప్తా వివరించి చెప్పారు. “ఏదేమైనా సరే, ఇలాంటి ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. దీని వల్ల ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు కొంత వరకు అయినా తగ్గుతాయి” అని ఈ వీడియో చూసిన వారు అంటున్నారు.
watch video :
ALSO READ : అయోధ్య రామ మందిరానికి విరాళాలు అందించిన సెలబ్రిటీలు వీరే….!
End of Article