ఈ 10 మంది “ప్రభాస్” హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే..?

ఈ 10 మంది “ప్రభాస్” హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే..?

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

Video Advertisement

ప్రభాస్ ఈశ్వర్ నుండి రీలజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా వరకు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. అయితే ఆ హీరోయిన్లలో కొంతమంది సినిమాలకు దూరం అయ్యారు. మరి ఆ హీరోయిన్లు ఎవరో? ఎక్కడ ఉన్నారో? ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
1. ఈశ్వర్ – శ్రీదేవి:

శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించింది.పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఆమె 2009 లో వ్యాపారవేత్త రాహుల్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప రూపిక. శ్రీదేవి బుల్లితెర ప్రోగ్రామ్ కి జడ్జిగా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలను తరచూ షేర్ చేస్తూంటుంది.
2. రాఘవేంద్ర – అన్షు:

హీరోయిన్ అన్షు ప్రభాస్ తో రాఘవేంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రంలో నటించింది. ఆ తరువాత సినిమాలు మానేసి లండన్ వెళ్ళి, బిజినెస్ మెన్ సచిన్ సాగ్గర్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒక బాబు అన్షు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.3. రాఘవేంద్ర – శ్వేతా అగర్వాల్:

ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమె ప్రసిద్ధ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు అయిన ఆదిత్య నారాయణ్ ని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది.
4. చక్రం – అసిన్:

చక్రం సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా నటించిన అసిన్, కొన్ని బాలీవుడ్ సినిమాలలో నటించిన తరువాత బిజినెస్ మ్యాన్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. వీరికి ఒక పాప.

5. పౌర్ణమి – సింధు తులాని:

ఐతే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సింధు తులాని, ప్రభాస్ తో పౌర్ణమి సినిమాలో నటించింది. పలు చిత్రాలలో నటించిన తరువాత చేతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా, మహారాష్ట్రలో సెటిల్ అయ్యింది. ఆమె చివరిగా నటించిన చిత్రం చిత్రాంగద.
6. పౌర్ణమి – మధు శర్మ:

ప్రభాస్ నటించిన పౌర్ణమి చిత్రంలో నటించిన మధు శర్మ కొన్ని చిత్రాలలో చిత్రాలలో నటించింది. విశ్వకర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
7. బుజ్జిగాడు – సంజన:

బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ లవర్ సిస్టర్ గా నటించిన సంజన పలు చిత్రాలలో నటించింది. సంజన బెంగుళూరు వైద్యుడు డాక్టర్ అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సంజన ఇండస్ట్రీకి దూరంగా భర్త, బిడ్డతో గడుపుతోంది.
8. బిల్లా – నమిత:

ప్రభాస్ తో బిల్లా సినిమాలో నటించిన నమిత తెలుగు, తమిళ భాషలలొ ఎన్నో చిత్రాలలో నటించింది. ఆమె వీరేంద్ర చౌదరి అనే పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. నమిత ప్రస్తుతం తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మెంబర్ గా కొనసాగుతున్నారు. గత ఏడాది ఈ జంటకు కవలలు జన్మించారు.
9. రెబల్ – దీక్షా సేథ్:

ప్రభాస్ తో రెబల్ చిత్రంలవ నటించిన హీరోయిన్ దీక్షా సేథ్ పలు చిత్రాలలో నటించినప్పటికి బ్రేక్ రాలేదు. దీంతో ఆమె నటనకు గుడ్ బై చెప్పి, లండన్ వెళ్లి, అక్కడే సెటిలైపోయింది. ప్రస్తుతం అక్కడే ఐటీ జాబ్ చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
10. మిర్చి – రిచా గంగోపాధ్యాయ:

మిర్చి మూవీలో ప్రభాస్ తో నటించిన రిచా గంగోపాధ్యాయ హైయర్ స్టడీస్ చేయడం కోసం సినిమాలకు దూరం అయ్యింది.
చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే ఒక అమెరికన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఒక బాబు.

Also Read: MALLI PELLI REVIEW : “నరేష్, పవిత్ర లోకేష్” నటించిన మళ్ళీ పెళ్లి ప్రేక్షకులని అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like