ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ గా మారింది. 2024 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చిత్రాలతో వచ్చిన సంపాదన మొత్తం మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఏ స్వార్ధము లేకుండా ఏపీ లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు కుటుంబాల ప్రయోజనాల కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులకు 2024 వ సంవత్సరము ఎన్నికలలో జనసేనాని సీఎం కావాలి ఆయన అభిమానులు సహా అందరూ కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉందని అభిమానులు వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నది ఏంటంటే ” తెలుగు రాష్ట్రమున పవనుడోచ్చేనయ! రాజవారసత్వము నశించినయ! ప్రజాస్వామ్యం విలసిల్లునయ! తప్పదు నా మాట నమ్మండయ అని రాసింది. ఈ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసి నా పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంతో పండగ చేసుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతవరకు నిజం అవుతుందనే విషయాన్ని 2024 ఏపీ రాజకీయ ఎన్నికలు వరకు వేచి చూడాలి.