అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆస్ట్రోనాట్ కి ముక్కు మీద దురద వస్తే..ఏం చేస్తారో తెలుసా.?

అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆస్ట్రోనాట్ కి ముక్కు మీద దురద వస్తే..ఏం చేస్తారో తెలుసా.?

by Mohana Priya

Ads

మనం మామూలుగా నేల మీద చేసే ఎన్నో పనులు అంతరిక్షంలో చేయలేము. అంతరిక్షంలోకి వెళ్ళడానికి కూడా చాలా మానసిక శక్తి, సమయస్ఫూర్తి కావాలి. అక్కడ ఉండడం చాలా కష్టం. సహజంగా ఊపిరి కూడా తీసుకోలేము. ఇంక మనం ఊపిరి తీసుకోలేని సమయంలో అక్కడ జరిగే వాటిని పరిశీలించడం అనేది ఇంకా కష్టం. అందుకే అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన వాళ్ళని మన ప్రపంచం అంతగా గౌరవిస్తుంది.What do astronauts do if they have itching on nose

Video Advertisement

అక్కడ వారు చాలా ఎక్కువ కాలం ఏమీ ఉండరు. కొద్ది కాలం మాత్రమే ఉండి వస్తారు. కానీ ఆ కొద్ది సేపు ఉండటం కూడా చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటి శ్రమలో కూడా వాళ్లు వారు వెళ్ళిన లక్ష్యాన్ని మర్చిపోరు. ఎలాంటి పరిస్థితి అయినా ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే వస్తారు. అంతరిక్షంలో వారు ఉండే విధానం గురించి మనకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి.అందులో ఒకటి “ఒకవేళ ఆస్ట్రోనాట్ స్పేస్ వాక్ చేసేటప్పుడు వారికి ముక్కు పై లేదా ముఖం మీద దురద వస్తే ఏం చేస్తారు?”. ఆస్ట్రోనాట్ హెల్మెట్ పెట్టుకుని ఉంటారు.What do astronauts do if they have itching on nose

ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ తీయరు. ఎందుకంటే అలా తీయడం వల్ల స్పేస్ లో ఉండే టెంపరేచర్ కి మనిషి శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితిలో వారికి ముక్కుపై, కానీ ముఖం మీద గాని దురద వస్తే ఏం చేస్తారో తెలుసుకుందాం. హెల్మెట్ లోపలి భాగంలో వెల్క్రో అనే పదార్థంతో తయారు చేసిన ఒక ప్యాచ్ అతికించబడి ఉంటుంది. ఒకవేళ వారికి దురద వస్తే గనక ఆ ప్యాచ్ కి వారి ముక్కుని రుద్దుకుంటారు. అప్పటికి కూడా తగ్గకపోతే, దాని నుండి డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు .


End of Article

You may also like