టెస్ట్ మ్యాచ్ “లంచ్ బ్రేక్” లో క్రికెటర్లు ఏ ఆహారపదార్ధాలని తీసుకుంటారో తెలుసా…?

టెస్ట్ మ్యాచ్ “లంచ్ బ్రేక్” లో క్రికెటర్లు ఏ ఆహారపదార్ధాలని తీసుకుంటారో తెలుసా…?

by Megha Varna

Ads

అథ్లెట్స్ ఎన్నో రకాల వ్యాయామాలను చేసి ఫిట్ గా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మరియు వారి ఆరోగ్యం పట్ల శరీరం పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. గంటల తరబడి ప్రాక్టీస్ చేయడం మరియు ఆటలు ఆడటం వల్ల చాలా అలసిపోతారు. వీరికి చాలా శక్తి అవసరం. అలా అని అతిగా తింటే ఫిట్నెస్ తగ్గిపోతుంది. మరి ఈ టెస్ట్ క్రికెట్ వంటి వాటిలో లంచ్ బ్రేక్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు క్రికెటర్స్ ఏమి తింటారు…? అంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటే వాళ్లు ఆటను సరిగ్గా ఆడలేరు కదా.

Video Advertisement

సహజంగా టెస్ట్ క్రికెట్ లో రోజుకు మూడు సెషన్స్ అవుతాయి. అయితే అందులో రెండు బ్రేక్స్ ఇస్తారు. ఫస్ట్ సీజన్ మొదలయ్యే ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అందులో భాగంగా పాలు, బ్రెడ్, పాస్తా, గుడ్లు మొదలైనవి ఉంటాయి. ఆ తర్వాత లంచ్ బ్రేక్. ఈ బ్రేక్ లో భాగంగా చికెన్, ఫిష్, పన్నీర్ వంటి మొదలైన ఆప్షన్స్ ఉంటాయి. అయితే వీరు తీసుకునే ఆహారంలో ఎటువంటి రూల్స్ ఉండవు, వాళ్ళకి కావలసిన ఆహారాన్ని తీసుకోవచ్చు.

బ్రేక్ తర్వాత వాళ్ళు ఆడటానికి వెళ్తున్నారో లేదో ముందే తెలుస్తుంది. దాని బట్టి వారి ఆహారాన్ని మార్చుకోవచ్చు, అంటే ఎక్కువగా తిన్న తర్వాత పరిగెత్తడానికి కష్టమవుతుంది దాని వల్ల ఆటపై ప్రభావం ఎక్కువ ఉంటుంది. చివరగా స్నాక్స్, ఈ బ్రేక్ లో టీ, కాఫీ, శాండ్విచ్, బిస్కెట్స్ వంటివి ఉంటాయి.

అప్పుడు కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ప్రస్తుతం ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ధ చూపేవారు ఎక్కువయ్యారు. అయితే వారు మాత్రం వారి న్యూట్రిషనిస్ట్ చెప్పిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. క్రికెట్ మ్యాచ్ సమయంలో అక్కడ ఎటువంటి ఆహారం అందుబాటులో ఉంటుందో దాన్ని బట్టి వారికి నచ్చిన ఆహారాన్ని తింటారు.


End of Article

You may also like