“వాట్సాప్” లో ఏదైనా “ఫైల్” సెండ్ చేసినప్పుడు ఇది ఎప్పుడైనా గమనించారా.? దానికి అర్ధం ఏంటో తెలుసా.?

“వాట్సాప్” లో ఏదైనా “ఫైల్” సెండ్ చేసినప్పుడు ఇది ఎప్పుడైనా గమనించారా.? దానికి అర్ధం ఏంటో తెలుసా.?

by Mohana Priya

Ads

మనం ఎవరితోనైనా మాట్లాడాలి అంటే, వారు మనకి దూరంగా ఉంటే మనం వాడే ఒకే ఒక్క పరికరం ఫోన్. ఒకవేళ ఫోన్ లో కూడా మనకి మాట్లాడడం కష్టం అయితే మనం ఎంచుకునే ఆప్షన్ మెసేజ్ చేయడం. అందులో కూడా మెసేజ్ చేయడానికి ఎక్కువ మంది వాడేది వాట్సాప్.

Video Advertisement

Serial number on WhatsApp documents and photos

వాట్సాప్ వచ్చిన తర్వాత మెసేజ్ పంపించడం మాత్రమే కాకుండా, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ వంటివి కూడా షేర్ చేయడం చాలా సులభం అయ్యింది. ఆ తర్వాత మిగిలిన అప్లికేషన్లు కూడా ఈ ఫీచర్స్ ని పరిచయం చేశాయి. అయితే ఎక్కువ మంది మాత్రం వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా?

Serial number on WhatsApp documents and photos

మనం వాట్సాప్ లో ఏదైనా ఇమేజ్ కానీ, డాక్యుమెంట్ కానీ షేర్ చేసినప్పుడు షేర్ చేసిన ఇమేజ్ కి, లేదా డాక్యుమెంట్ కి ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి అర్థం తెలుసా ? మనలో చాలా మంది అది ఏదో సీరియల్ నెంబర్ అని అనుకుంటాం. కానీ ఆ సీరియల్ నెంబర్ వెనక మనకు తెలియని ఒక అర్థం ఉంది.

Serial number on WhatsApp documents and photos

అదేంటంటే మనం షేర్ చేసినప్పుడు వచ్చిన సీరియల్ నంబర్ లో మొదటి 4 అంకెలు ఆ సంవత్సరాన్ని, తర్వాత రెండు అంకెలు ఆ నెల, తర్వాత రెండు అంకెలు ఆ తేదీని సూచిస్తాయి. అలాగే అండర్ స్కోర్ ( _ ) తర్వాత ఉన్న మొదటి రెండు అంకెలు ఆ డాక్యుమెంట్ జనరేట్ అయిన సమయంలోని గంటలని, ఆ తర్వాత రెండు అంకెలు నిమిషాలని, చివరి రెండు అంకెలు సెకండ్ లని సూచిస్తాయి.

Serial number on WhatsApp documents and photos

పైన ఉన్న ఫోటోలో రౌండప్ చేసి ఉన్న ఆ జేపీజీ (JPG) డాక్యుమెంట్ మీద ఉన్న సంఖ్యను గమనించండి. దానిపై ఉన్న నంబర్ ప్రకారం ఆ ఫోటో ని 2020 సంవత్సరంలో, ఆగస్టు (08) నెలలో 25 వ తేదీన 09 గంటల 34 నిమిషాల 36 సెకండ్ల కి జనరేట్ అయ్యింది. ఈసారి మీరు కూడా వాట్సాప్ ద్వారా ఏదైనా షేర్ చేసేటప్పుడు దాని మీద ఉన్న సీరియల్ నంబర్ ని గమనించండి.


End of Article

You may also like