రైలు బోగీల‌పై ఆ నంబ‌ర్లు, లెటర్ లు ఎప్పుడైనా గమనించారా? దానికి అర్ధం ఏంటో తెలుసా?

రైలు బోగీల‌పై ఆ నంబ‌ర్లు, లెటర్ లు ఎప్పుడైనా గమనించారా? దానికి అర్ధం ఏంటో తెలుసా?

by Mohana Priya

Ads

జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా మనం మనం ట్రైన్ ఎక్కినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ట్రైన్ ని ఎక్కువ గమనించము. మన బెర్త్ తప్ప మిగిలినవి మనం పట్టించుకోము. కానీ ట్రైన్ లో ఉండే అక్షరాలు, అంకెల వెనకాల చాలా అర్థాలు దాగి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

Video Advertisement

బోగీ మీద ఒక నంబరు ఉంటుంది. ఆ నంబర్ లో ఉండే మొదటి రెండు అంకెలు ఆ బోగి తయారుచేసిన సంవత్సరాన్ని చెబుతాయి. ఒకవేళ 04 అంకె తో ఆ బోగి మొదలైంది అనుకోండి, అది తయారు చేసింది 2004వ సంవత్సరంలో అన్నట్టు అర్థం. ఒకవేళ 91 తో మొదలైతే 1991 సంవత్సరంలో దాన్ని తయారు చేశారు అని అర్థం. సాధారణంగా ఈ నంబరు 5 లేదా 6 అంకెలు కలిగి ఉంటుంది. మొదటి 2 నంబర్లు సంవత్సరాన్ని సూచిస్తే తర్వాత ఉండే నంబర్లు ఆ బోగి ఎలాంటిదో సూచిస్తుంది.

  • ఒకవేళ తర్వాత నంబర్లు 025 నుండి 050 మధ్యలో ఉంటే అప్పుడు ఆ బోగీ ఫస్ట్ ఏసి+ టు టైర్ ఏసీ ని సూచిస్తాయి.
  • ఒకవేళ 050 నుండి 100 మధ్యలో ఉంటే అది టు టైర్ ఏసీ ఉన్న బోగీ అని అర్థం
  • 101 నుండి 150 మధ్యలో ఉంటే త్రీటైర్ ఏసీ అని అర్థం
  • 151 నుండి 200 మధ్యలో ఉంటే ఏసీ చైర్ కార్ బోగీ అని అర్థం. అంటే ఇందులో బెర్తులు ఉండవు బస్సులో        లాగా సీట్లు ఉంటాయి.
  • 201 నుండి 400 మధ్యలో ఉంటే అది స్లీపర్ సెకండ్ క్లాస్ బోగీ అవుతుంది.
  • 400 నుండి 600 మధ్యలో ఉంటే జనరల్ సెకండ్ క్లాస్ బోగీ అని అర్థం
  • 601 నుండి 700 మధ్యలో ఉంటే అది లోయర్ బెర్త్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉన్న జనశతాబ్ది ఎక్ష్ప్రెస్.
  • 701 నుండి 800 మధ్యలో ఉంటే సిటింగ్ ఏర్పాటుతోపాటు లగేజ్ పెట్టుకునే వీలున్న బోగీ అని అర్థం

ట్రైన్ లోపల కూడా కొన్ని అక్షరాలు ఉంటాయి. అవేంటో అవి ఏం సూచిస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం.

 

WGSCN అనే కోడ్ అర్థం ఏమిటంటే…

W అంటే – prefix సిరీస్ ప్రారంభ అక్ష‌రం
G అంటే – Self-generating (lighting by axle generators) – స్వయం చాలిత బోగీ
S అంటే – సెకండ్ క్లాస్ (Second Class)

అయితే ఇక్క‌డ WGSCNలో చివ‌ర‌న ఉన్న రెండు అక్ష‌రాలు (CN) బోగీని బ‌ట్టి మారుతాయి. అవేమిటంటే…

  • CN అంటే 3 టైర్ స్లీపర్ కోచ్
  • CW అంటే టు టైర్ స్లీపర్ కోచ్
  • CB అంటే పాంట్రీ, లేదా కిచెన్, లేదా బఫెట్ బార్ అని అర్థం
  • CL అంటే కిచెన్ కార్
  • CR అంటే స్టేట్ సెలూన్
  • CT అంటే ఫస్ట్ క్లాస్ టూరిస్ట్ కార్. అందులో బాత్ రూమ్, కిచెన్, సిట్టింగ్, ఇంకా పడుకోవడానికి కూడా వీలు ఉంటుంది అని అర్థం.
  • CTS అంటే సెకండ్ క్లాస్ టూరిస్ట్ కార్. ఇందులో కూడా కిచెన్, బాత్రూం, ఇంకా కూర్చోడానికి పడుకోడానికి వీలు ఉంటుంది అని అర్థం.

ఇక WGSCN కిందే ఉన్న 96241 అనే నంబ‌ర్ గురించి పైనే చెప్పుకున్నాం క‌దా. ఆ బోగీ 1996లో త‌యారైంద‌ని, 241 అంటే ఆ బోగీ స్లీప‌ర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.

  • AC అంటే ఎయిర్ కండిషన్ ఇది సాధారణం గా అందరికీ తెలిసిన విషయమే
  • C అంటే coupe. ఇందులో ఒక లోయర్ బెర్త్ ఒక అప్పర్ బెర్త్ ఉంటుంది.
  • D అంటే డబల్ డెక్కర్
  • రైలు చివర బోగీ పై X అన్న అక్షరం ఉంటే అది ఆ రైలు చివరి బోగీ అని అర్థం.
  • Y అంటే లేడీస్ కంపార్ట్మెంట్. ఇందులో ఆరు బెర్తులు నుండి లాక్ చేసుకోవడానికి తలుపు కూడా ఉంటుంది.

అలా ట్రైన్ కి సంబంధించిన ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ కి ఏదో ఒక అర్థం ఉంటుంది.

 


End of Article

You may also like