మీకు ఇష్టమైన కలర్ ఏంటి..? ఆ రంగు మీ గురించి ఏం చెబుతోందంటే.?

మీకు ఇష్టమైన కలర్ ఏంటి..? ఆ రంగు మీ గురించి ఏం చెబుతోందంటే.?

by Mohana Priya

Ads

ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తను ఇష్టపడే రంగుని బట్టి చెప్పొచ్చు అని అంటారు. అలా ఒక మనిషి ఇష్టపడే రంగుని బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 నీలం

నీలం రంగు ఇష్టపడేవాళ్ళు శాంతిని కోరుకుంటారట. అలాగే స్టెబిలిటీ ఉండాలి అనుకుంటారట. అలాగే వేరే వాళ్ళకి ఏం కావాలి అనే విషయంపై కూడా ఎక్కువగా ఆలోచిస్తారు.

What does your favorite color says about your personality

#2 తెలుపు

వీరు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. వారు ఎవరి మీద ఆధారపడరు. అన్నిటి గురించి ప్లాన్ చేసుకొని ఉంటారు. అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించి, లాజికల్ గా ఆ సమస్యను పరిష్కరించడానికి చూస్తారు.

What does your favorite color says about your personality

#3 ఆకుపచ్చ

వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం కలవారు. వీరికి వీరి గౌరవం అనేది చాలా ముఖ్యం. వీరికి ప్రకృతితో ఒక ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వీరికి గొడవలు అంటే పెద్దగా నచ్చవు. టైం మ్యానేజ్ చేయగలుగుతారు. ముఖ్యమైన వాటి మీద దృష్టి పెట్టి అనవసరమైన వాటిపై దృష్టి వెళ్ళకుండా చూసుకోగలుగుతారు వీరిలోని స్పష్టత, వీరి ఆలోచనలను ఇతరులు బాగా ఇష్టపడతారు. వీరికి ప్రకృతిలో సమయం గడపడం లాంటివి ఎక్కువగా ఇష్టం ఉంటుంది.

What does your favorite color says about your personality

#4 బ్రౌన్

వీరు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే, వారికి చాలా మంచి స్నేహితులుగా ఉంటారు. వస్తువుల కంటే కూడా మనుషులకి, వారి భావాలకి ఎక్కువ విలువ ఇస్తారు.

What does your favorite color says about your personality

#5 ఆరెంజ్

వీరు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వీరు సోషల్ గా ఎక్కువగా అందరితో కలుస్తారు. ఎవరినైనా సరే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తారు. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా కూడా దేనికి భయపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో వారికి గౌరవం ఉండాలి అని అనుకుంటారు. అదే విధంగా పాజిటివ్ గా పని చేస్తారు.

What does your favorite color says about your personality

#6 ఎరుపు

వీరికి జీవితంలో ఏదో చేయాలని, ఏదో సాధించాలని ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దేనికి భయపడరు. వీరు ఎవరినైనా ఇష్టపడితే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరి మీదైనా కోపం ఉంటే అది ఎక్కువ కాలం మనసులో పెట్టుకోరు. తొందరగా అది మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతారు.

What does your favorite color says about your personality

ఏ విషయంలో అయినా సరే పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ఎవరి వల్ల అయినా ఇబ్బంది కలిగినా, లేకపోతే వీరిని ఎవరైనా నిరాశపరిచినా కూడా ఎదుటి వారికి తాము ఏం అనుకుంటున్నాం అని చెప్పడానికి అస్సలు వెనకాడరు.

What does your favorite color says about your personality

#7 గ్రే

వీళ్లు వారి పని వారు చూసుకొని వెళ్ళిపోతారు. వీరిని చూసిన వాళ్లందరూ వీరు చాలా బాలెన్స్డ్ గా ఉన్నారు అని, అలాగే నమ్మకస్తులు అని అనుకుంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు.

What does your favorite color says about your personality

#8 పర్పుల్

పర్పుల్ రంగు ఇష్టపడే వాళ్ళు పర్ఫెక్షనిస్ట్ గా ఉంటారు. వారికి ఎమోషనల్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. అలాగే వారు మంచి వ్యక్తులు కూడా అయి ఉంటారు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి వారే ముందు ఉంటారు.

What does your favorite color says about your personality

#9 నలుపు

నలుపు రంగు ఇష్టపడేవాళ్ళు జీవితం మీద కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారు. వారు వారి వ్యక్తిగత జీవితానికి చాలా విలువ ఇస్తారు. కేవలం వారికి క్లోజ్ గా ఉన్న వ్యక్తులకు మాత్రమే వారి ఫీలింగ్స్ గురించి తెలుస్తాయి. వారికి ఎప్పుడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో, వారి అభిప్రాయాన్ని ఎలా చెప్పాలో తెలిసి ఉంటుంది. వారిపై వారికి కంట్రోల్ కూడా ఉంటుంది. వారికి ముఖ్యమైన ప్రతి చిన్న విషయంపై కూడా దృష్టి పెడతారు.

What does your favorite color says about your personality

#10 గులాబీ రంగు

వీరు ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. ఏ విషయంలో అయినా సరే మంచి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నా కానీ, ఇబ్బందిలో ఉన్నా కానీ వారిని ఓదార్చడానికి, వారికి మానసికంగా ధైర్యం ఇవ్వడానికి వీరు ముందు ఉంటారు. వీరికి ప్రశాంతత అనేది చాలా ముఖ్యం.

What does your favorite color says about your personality

#11 పసుపు

వీరికి కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నా, వారు నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం అన్నా కూడా చాలా ఇష్టపడతారు.

What does your favorite color says about your personality

End of Article

You may also like