తలలో రెండు సుడులు ఉంటే ఏమవుతుంది..? రెండు పెళ్లిళ్లు అవుతాయా..?

తలలో రెండు సుడులు ఉంటే ఏమవుతుంది..? రెండు పెళ్లిళ్లు అవుతాయా..?

by Megha Varna

Ads

ఎవరికైనా తల మీద రెండు సుడులు ఉన్నాయంటే వెంటనే ఎవరైనా సరే రెండు పెళ్లిళ్లు అవుతాయి. ఇద్దరు భార్యలు వస్తారు అని అంటారు. ఇది సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం. అయితే నిజంగా తల మీద రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా..?, ఇద్దరు పెళ్ళాలు వస్తారా..? అనే దాని గురించి తెలుసుకుందాం.

Video Advertisement

నిజానికి తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవ్వవు. కేవలం సరదాగా చెప్పుకోవడానికి మాత్రమే. శాస్త్రాలలో చూసుకున్నట్లయితే రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయి అని ఎక్కడా లేదు. అయితే మరి రెండు సుడులు ఉంటే ఏమౌతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెండు సుడులు ఉన్నవాళ్ళ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని జ్యోతిష్య శాస్త్రం చెప్పింది. మరి అవేమిటో ఇప్పుడే చూసేద్దాం.

రెండు సుడులు ఉంటే అది అదృష్టానికి సంకేతం. రెండు సుడులు ఉండడం అనేది జీవితంలో అదృష్టాన్ని తీసుకు వస్తుంది. అలానే ఈ వ్యక్తులు కాస్త కొత్తగా, మంచిగా ఆలోచిస్తారు. ఎక్కువగా ఇలా రెండు సుడులు వున్నవాళ్లు భ‌విష్య‌త్ పై దృష్టి ఎక్కువ‌గా పెడతారు. పైగా వీరికి ముందు చూపు బాగా ఎక్కువ. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు తొందర పడరు. ఎంతో నెమ్మదిగా, నిదానంగా వ్యవహరిస్తారు.

పైగా వీళ్ళు ఎవరి చేతిలో కూడా అంత సులభంగా మోసపోరు. వీళ్ళు బాగా క‌ష్ట‌ప‌డి పైకి వ‌స్తారు. చురుకుగా వుంటారు వీళ్ళు. అలానే రెండు సుడులు ఉంటే జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటారు. పైగా వీళ్ళు ఏ రంగంలోకి వెళ్లి స్థిరపడాలన్న మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. అలానే జీవితంపై వీరికి అవగాహన కూడా ఎక్కువే. అంతే కానీ రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవ్వవు. ఇద్దరు భార్యలు వుండరు అని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.

 


End of Article

You may also like